Posted [relativedate]
స్టార్ హీరోయిన్ నయనతార ప్రియుడు కోసం నిష్టగా పూజలు చేస్తోంది. ప్రియుడు విగ్నేష్ శివన్ తో తన పెళ్లి జరగాలని తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న ఆలయంలో తులాభారన్ని వేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పిక్స్ పై నెటిజర్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
నయనతారకి ఇది మూడో లవ్ ఏపీసోడ్. గతంలో శింభు, ప్రభుదేవాలతోనూ ప్రేమాయణం సాగించింది ఈ ముద్దుగుమ్మ. అప్పట్లో నటుడు శింభుతో తెరవెనక, తెరమీద నయన్ చేసిన రొమాన్స్ హాట్ టాపిక్ గా కొనసాగింది.శింభుతో చెడిన తర్వాత ఇండియన్ మైకల్ జాక్సెన్ తో లవ్వాట మొదలెట్టింది నయన్. పీకల్లోతూ ప్రేమతో మునిగిపోయిన ఈ జంట చాలా దూరమే వెళ్లారు. ఓ దశలో వీరి పెళ్లితో ఒక్కటవ్వడం ఖాయమనే టాక్ వినపడింది. చివరికి.. ప్రభుదేవాతోనూ నయన్ ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది. దీంతో.. కొన్నాళ్ల పాటు సలైంట్ గా ఉన్న నయన్.. మళ్లీ కుర్ర దర్శకుడు విగ్నేష్ శివతో ప్రేమలో పడింది.
ఇప్పుడు వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. గత అనుభవాల దృష్ట్యా ముచ్చటగా మూడో ప్రియుడు విగ్నేష్ దూరం కాకూడదని నయన్ పూజలు చేస్తుందట.
తాజాగా, చేసిన పూజలు ప్రియుడి కోసమేనని కోలీవుడ్ కోడై కూస్తోంది.
ఇదిలావుండగా.. ఇటీవల విక్రమ్‌తో ‘ఇరుముగన్’ సినిమాతో భారీ హిట్ అందుకుంది నయన్.ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. అయితే,సూర్య హీరోగా ప్రియుడు విగ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నయన్ నే హీరోయిన్ గా తీసుకొన్నట్టు చెబుతున్నారు. నయన్ లేకుండా సినిమా చేయనని విగ్నేష్ పట్టుపట్టాడట. మొత్తానికి.. ప్రియుడు విగ్నేష్ దూరం కాకూడదని నయన్ నిష్టగా పూజలు చేస్తోంది.. మరి దేవుడు కరుణీస్తాడో లేదో.. చూడాలి.