డోర రివ్యూ..!

 Posted [relativedate]

nayanthara dora movie reviewచిత్రం:  డోర‌ 

న‌టీన‌టులు: న‌య‌న‌తార‌, తంబిరామ‌య్య‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, సులైల్ కుమార్

సంగీతం: వివేక్ శివ, మెర్విన్ సోలోమ‌న్‌ 

ఛాయాగ్ర‌హ‌ణం:  దినేశ్ కృష్ణ‌న్‌ 

కూర్పు:  గోపీకృష్ణ‌ 

నిర్మాత‌: మ‌ల్కాపురం శివ‌కుమార్‌ 

ద‌ర్శ‌క‌త్వం:  దాస్ రామ‌స్వామి. 

విడుద‌ల తేదీ: 31-03-2017

నయనతార.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇటీవల మయూరి అనే హారర్ సినిమాలో నటించిన మెప్పించిన నయన్ మరోసారి సారి డోరతో భయపెట్టడానికి ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ డోర సినిమాతో నయన్  ఆడియన్స్ ను ఏ మేరకు భయపెట్టిందో తెలుగు బుల్లెట్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కధ ఏంటంటే:

ఈ సినిమాలో నయనతార.. పారిజాతంలా నటించింది.

పారిజాతం తన తండ్రితో కలిసి జీవిస్తుంటుంది. తల్లి లేని కూతర్ని చాలా గారాబంగా పెంచుతాడు తండ్రి. ఓ మంచి అబ్బాయిని చూసి పారిజాతానికి పెళ్లి చేయాల‌నుకొంటాడు. కాగా పారిజాతం తన అత్తయ్య కంపెనీకు పోటీగా కాల్ టాక్సీ బిజినెస్‌లో రాణించాలనుకుంటుంది. దీనిలో భాగంగా తన తండ్రితో కలిసి వింటేజ్ ఆస్టిన్ కేంబ్రిడ్జ్ కారును.. డోరాని కొంటుంది. ఓ రోజు పారిజాతం కార్‌ ను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఒక స్టేజ్ లో కార్ పారిజాతం కంట్రోల్‌ లో లేకుండా దానంతటడే వెళ్ళి ఓ వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపేస్తుంది. దీంతో భయపడిపోయిన పారిజాతం ఆ కార్‌ ను అక్కడే  వదిలేసి ఇంటికి వెళ్లిపోతుంది. కానీ ఆ కార్ మాత్రం పారిజాతాన్ని విడిచిపెట్టదు. అసలు కార్‌ లో ఏముందో తెలుసుకునే ప్రయత్నంలో పారిజాతానికి కొన్ని విషయాలు తెలుస్తాయి. మరో పక్క సిటీలో ఓ ముగ్గురు వ్యక్తులు కొందరిని టార్గెట్ చేస్తూ డబ్బు గుంజుతూ వారిని హత్య చేస్తుంటారు. అవి ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఓ పోలీస్ ఆఫీసర్ నానాతంటాలు పడుతుంటాడు. హత్యలు చేస్తున్న గ్యాంగ్ కు కార్ కి ఏమైనా సంబంధం ఉందా.. ఆ కార్ పారిజాతాన్ని ఎందుకు  విడిచి పెట్టడం లేదు..  కార్ ఎవరి మీద పగ తీర్చుకుంది.. అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరమీద చూడాల్సిందే.

కధనం ఏంటంటే:

ప‌గ‌, ప్ర‌తీకారం నేప‌థ్యంతో ముడిప‌డ్డ క‌థ ఇది. ఓ పెంపుడు కుక్క ఆత్మ కారుని ఆవహించి తన యజమానిని చంపిన వారిపై పగ తీర్చుకోవడమే డోర సినిమా.

ఎవరు ఎలా చేశారంటే:

సినిమా మొత్తం నయనతార చుట్టూనే తిరుగుతుంది. గారాబంగా పెరిగిన కూతురిగా అలానే పంతం  సాధించేంత‌వ‌ర‌కు విశ్ర‌మించ‌ని డేరింగ్ ఉమెన్ గా న‌య‌న‌తార న‌ట‌న ఆక‌ట్టుకుంది. మిగిలిన నటీనటులు తమిళవాళ్లే కావడంతో పెద్దగా మాట్లాడడానికి స్కోప్ ఉండదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా పనితనం బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

నయనతార నటన

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

కధ

లాజిక్స్ లేని సన్నివేశాలు

ఆఖరిపంచ్: తమిళ వాసనతో నిండిన డోర

Telugu Bullet Rating: 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here