రామ్ గోపాల్ వర్మ ని క్రాస్ చేసిన ప్లాప్ దర్శకుడు..

0
432

  nayeem  biopic movie parepalli bharath director
బయోపిక్ ల మీద రాంగోపాల్ వర్మకి ఎంత ఆసక్తి ఉంటుందో అందరికీ తెలుసు.అందుకే నయీమ్ ఎన్ కౌంటర్ తరువాత వచ్చిన కథనాలతో అయన మరో బయోపిక్ కి రెడీ అయిపోయాడు.నయీమ్ జీవితం మీద ఏకంగా మూడు సినిమాలు తీస్తానని ప్రకటించాడు.ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయో తెలీదు కానీ ఇంతలోనే నయీమ్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది.

ఈ సినిమా ప్రారంభం దగ్గరనుంచి అంతా స్పెషల్ గానే కనిపిస్తోంది.సినిమా టైటిల్ ఖయీమ్ భాయ్ .దర్శకుడు పారేపల్లి భరత్ ..తపస్సు పాటలతో సూపర్ మ్యూజిక్ సెన్స్ వుందనిపించుకున్న ఈ డైరెక్టర్ ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ హిట్ ఇవ్వలేకపోయాడు.పైగా హీరో నవ్యఆంధ్ర రాజధాని ప్రాంతానికి చెందిన కట్టా రాంబాబు అనే అయన.హీరో సొంత వూరు మందడం లోనే సినిమా ముహూర్తపు షాట్ తీశారు.మంత్రి పుల్లారావు ,స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆ కార్యక్రమానికి వచ్చారు.ఇదేదో ఆషామాషీ సినిమా అనుకుందాం అనుకుంటే స్టార్ రైటర్ గోపి మోహన్ దీనికి మాటలు ,శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.మొత్తానికి ఓ ప్లాప్ డైరెక్టర్ ఖయీమ్ భాయ్ తో నయీమ్ జీవితచరిత్రను సినిమా తీయడంలో రాంగోపాల్ వర్మని క్రాస్ చేసేశాడు.

Leave a Reply