నేతలు,ఖాకీల అండతో రెచ్చిపోయిన నయీమ్

0
505

  nayeem fire hope politician police

రోజులు గడిచే కొద్దీ కరడుగట్టిన నేరగాడు నయిమ్ నేర సామ్రాజ్యంలో కంకాళాలు బయటపడుతున్నాయి. మాజీ మావోయిస్టును పెంచి పోషించినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీసు శాఖకు చెందిన సీనియర్ అధికారులు, మాజీ మంత్రులు, పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, బ్రోకర్ల వివరాలు బహిర్గతమవుతున్నాయి.  వ్యక్తిగత జీవితంలో విలాసవంతుడని, గోవా బీచ్‌లో బంగ్లా కూడా ఉందని, పొరుగురాష్ట్రాల్లో కూడా పెద్దఎత్తున ఆస్తులున్నట్టు పోలీసు దర్యాప్తులో వెల్లడవుతోంది. నయిమ్ డైరీలో తనకు సహకరించిన ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, బ్రోకర్ల పేర్లను కోడ్ భాషలో రాసుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇంతవరకు పట్టుకున్న సహచరుల సహాయంతో డైరీ కోడ్ చిక్కుముడిని విప్పుతున్నారు. గ్యాంగ్‌స్టర్ నరుూమ్ దందాల కేసును సిట్‌కు అప్పగించిన నేపథ్యంలో అతని అనుచరుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నరుూమ్ డైరీలో అనుచరులు, దందా విషయంలో కీలక సమాచారం లభ్యమవడంతో నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లో తనిఖీలు ముమ్మరమయ్యాయ. పాతికేళ్ల నేర సామ్రాజ్యంలో నయీంకు సహకరించిన వారిలో దాదాపు వంద మంది పోలీసులు, సుమారు 50 మంది ప్రజాప్రతినిధులు ఉన్నట్టు తెలుస్తోంది. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారులు, సర్పంచ్ మొదలుకొని ఎమ్మెల్యే స్థాయి వరకూ నయీంకు సహకరించిన వారిలో ఉన్నట్టు పోలీసులకు లభించిన డైరీలో సమాచారం ఉంది.

నయీం ఎన్‌కౌంటర్ తరువాత ఇప్పటి వరకు 11మంది కుటుంబీకులను విచారించారు. 20 మంది వరకు పోలీసుల అదుపులో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.  నయిమ్  డ్రైవర్ శ్రీధర్‌గౌడ్ అరెస్టుతో పలు అక్రమాలు వెలుగుచూశాయి. ల్యాండ్ డాక్యుమెంట్ల ఆధారంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్ జిల్లాలు సహ పలు ప్రాంతాల్లో నరుూం అనుచరుల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న పలు డాక్యుమెంట్ల ఆధారంగా వాటి యజమానుల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు.

కాగా నార్సింగ్‌లోని నరుూమ్ ఇంట్లో పోలీసులు మరోసారి సోదాలు జరిపారు. సోదాల్లో పెన్ డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్కుల్లో ఉన్న సమాచారాన్నిక్రోడీకరిస్తున్నారు. కుంట్లూరులోని నరు నయిమ్ సోదరుడు సలీం, బావమర్ది ఫహీంలను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమాల చిట్టా రోజురోజకూ పెరుగుతోంది. మహిళా అనుచరులు ఫర్హానా, అఫ్సానాను మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అల్కాపురి అపార్ట్‌మెంట్‌లో  నయిమ్ అనుచరుడు రియాజ్‌ను పోలీసులు అరెస్టు చేసి నల్గొండకు తరలించి రహస్యంగా విచారిస్తున్నట్టు సమాచారం. సరూర్‌నగర్, మన్సూరాబాద్, ఆదిభట్లలోని నరుూం భూముల వివరాలపై ఆరా తీస్తున్నట్టు సిట్ అధికారి ఒకరు తెలిపారు.

Leave a Reply