నయీమ్ పన్నేశాడు….

 nayeem tax like mahesh businessman movieసూపర్ హిట్ అయిన బిజినెస్ మ్యాన్ సినిమా గుర్తుందా. బిజినెస్ మ్యాన్  సినిమాలో హీరో ముంబయిని సుస్సు పోయించటానికి వచ్చానని చెబుతూ.. నిజంగానే పోయించటం.. తన మాఫియా చేష్టలతో దేశ రాజకీయాల్నే ప్రభావితం చేసే శక్తిగా మారటం లాంటివి కనిపిస్తాయి. ఈ సినిమాలో ఒక సీన్లో హీరో మహేశ్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది. ‘‘ప్రతి టేబుల్ మీదా మన గన్ ఉండాలి. సూర్య ట్యాక్స్ పేరుతో పన్ను కట్టాల్సిందే. ఎవడైనా కట్టనని అంటే గన్ చూపించి బెదిరించండి’’ అంటూ చెబుతాడు. ఇదంతా రీల్ స్టోరీ.

అచ్చం ఆ మూవీలాగానే నయిం అన్న టాక్స్ (ఎన్‌ఏటి) పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు సిట్ అధికారులు గుర్తించారు. నయిం ఆస్తులకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నయిం కొందరు పెద్దలు మాట్లాడినట్టుగా వీడియో రికార్డులను సిట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజులుగా నయిం బంధువులు, అనుచరుల ఇళ్లలో జరుపుతున్న సోదాల్లో స్వాధీనం చేసుకున్న వీడియో, సిడిలను సిట్ అధికారులు స్కూృటినీ చేస్తున్నారు కానీ.. రియల్ గా కూడా సేమ్ టు సేమ్ సీన్ చేసి చూపించాడు గ్యాంగ్ స్టర్ నయిం.

అన్ని వ్యవస్థల్ని దాదాపు తన గుప్పిట్లో పెట్టుకొని.. ఎవరిని ఎప్పుడు ఎలా.. ఎంతలా వాడుకోవాలో క్యాలికులేటెడ్ గా వాడేస్తూ వేల కోట్లు వెనకేసి..పెద్ద ఎత్తున హత్యలు చేసి.. తన పేరునే ఒక బ్రాండ్ గా మార్చటమే కాదు.. భూదందాలు.. సెటిల్ మెంట్లను పెద్ద ఎత్తున చేసిన నయిం ఒకదశలో తన పేరిట ట్యాక్స్ ను సైతం వసూలు చేసిన వైనం సంచలనంగా మారింది.నయిం ఎన్ కౌంటర్ అనంతరం అతడి దురాగతాలు బయటకు వస్తున్నాయి. వెలుగులోకి వస్తున్న అతడి దాదాగిరి విస్మయాన్ని కలిగిస్తున్నాయి.

బిజినెస్ మ్యాన్ సినిమాలోసూర్య ట్యాక్స్ కట్టాలనిహీరో డైలాగు చెబితే.. రియల్ లైఫ్ లో నిజంగానే ఎన్ఎంటీ పేరిట ‘‘నయిం ట్యాక్స్’’ అంటూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు.ఇవ్వలేమన్న వారిని బెదిరించిన నయిం.. అప్పటికీ మాట వినని వారిని చంపేందుకు సైతం వెనుకాడలేదు.నయిం ట్యాక్స్ ను ఒక్క భువనగిరిలోనే వంద మంది వరకూ చెల్లించినట్లుగా చెబుతున్నారు. నయిం హతం కావటం.. అతడి దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వేళ.. నయిం బాధితులంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు.  సినిమాల్లో మాత్రమే కనిపించే దృశ్యాలని అనుకున్న వాటిని రియల్ లైఫ్ లోనూ అమలు చేయటం చూస్తే.. తప్పు చేసినోళ్లను శిక్షించాల్సిన వ్యవస్థలు అప్పుడు ఏమైపోయాయ్..?

SHARE