నయీమ్ కోడ్ లో వుందెవరు?

 nayeem use code language dairy

కరుడు గట్టిన నేరగాడు , గ్యాంగ్ స్టార్ నయీమ్ కేసులో కొత్త కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి … తాజాగా అల్కాపురి కాలనీ లో ఉన్న ఇంటికి కిలో మీటర్ దూరం ఉన్న మరో ఇంటిని గుర్తించిన పోలీసులు కు కొన్ని నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి … నయీమ్ డెన్ లో స్వాధీనం చేసుకున్న రెండు డైరీలో కీలక విషయాలు రాశాడు .. అందులో అనేక పదాలు , పేర్లు , సంఖ్యలు డైరీ లో రాశాడు .. అయితే అందులో తనకు గుర్తు ఉండేవిధంగా , ఇతరులకు ఆ సమాచారం తెలియకుండా ఉండాలి అంటే కొన్ని సీక్రెట్ పదాలు , అంకెలు తో కొన్ని రాసుకునట్లు సమాచారం ..

అయితే అందులో తనకు సహకరించిన పోలీస్ అధికారులు పేర్లు ను ఎవరికీ తెలియకుండా తనకు మాత్రమే తెలిసేవిదంగా కొన్ని కోడ్ లు ఏర్పాటు చేసుకొని , వారిని ఆపేరుతోనే పిలిచేవాడు అనేది విచారణ లో తేలింది .. అయితే ఈ కోడ్ లాంగ్వేజ్ ను పోలీసులు కు సైతం అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది .. పేర్లే కాకుండా తనకు సంబంధించిన భూములు , క్రయ విక్రయాలు కు సంబంధించి వివరాలు కూడా కోడ్ లాంగ్వేజ్ లో రాసుకునట్లు సమాచారం …ఒక్క నయీమ్ చాలామంది .. ఆర్థిక నేరగాళ్ళు , గ్యాంగ్ స్టార్లు , ఉగ్రవాదులు , ఐఎస్ఐస్ సానుభూతిపరులు కోడ్ లాంగ్వేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు .. అయితే ఈ కోడ్ లాంగ్వేజ్ అనేది ఇలానే పెట్టుకోవాలి అనేది లేదు .. ఎవరు కోడ్ లాంగ్వేజ్ పెట్టుకోవాలి అన్న వారి వ్యక్తి గతంగా వారికి గుర్తు ఉండేవిధంగా ఏర్పాటు చేయుకుంటారు ..

అయితే ప్రధానంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఈ కోడ్ లాంగ్వేజ్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు .. వారు ఏదైనా ప్లాన్ చేయాలి అంటే కచ్చితంగా ఎవరికీ అర్థం కానీ భాష లో వీరు ఒక కోడ్ లాంగ్వేజ్ ఏర్పాటు చేసుకొని వారి కార్యకలాపాలు కొనసాగిస్తారు .. అయితే తాజాగా మొన్న పాత బస్తీ లో ఐసిస్ ఉగ్రవాదులు ఎన్ ఐ ఏ అరెస్ట్ చేయడం తో కొన్ని కీలక విషయాలు వెలుగు లోకి వచ్చాయి .. హైదరాబాద్ లో వారు ఏమి చేయాలి అనుకుంటున్నారు .. ? నగరం లో ఎక్కడ పేలుళ్లకు కు ప్లాన్ చేశారు అనే విషయాలు అన్ని కూడా వారి కోడ్ లాంగ్వేజ్ లో రాసుకున్నట్లు సమాచారం … ఇలా ఆర్థిక నేరగాళ్లు కూడా సేమ్ టు సేమ్ .. తన సంపాదన ఎంత ఉంది ? తన ఆస్తులు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి .. అనే విషయాలు కూడా ఎవరికీ తెలియకుండా తనకు మాత్రమే గుర్తు ఉండేవిధంగా ఈ భాష ను ఏర్పాటు చేసుకుంటున్నట్లు పలు కేసుల విచారణ లో బయట పడ్డాయి …

నయీమ్ కేసు లో కొన్ని డైరీ లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే అందులో తన వ్యక్తి గత ఆస్తులు , వ్యక్తి గత పరిచయాలు ఉన్న వారి పేర్లు , ఆస్తుల సర్వే నంబర్స్ ఇవన్నీ కూడా నయీమ్ ఒక కోడ్ లాంగ్వేజ్ ఏర్పాటు చేసుకుని రాసుకునట్లు సమాచారం .. కోడ్ లాంగ్వేజ్ ఉన్నవాటిని పోలీసులు డీ కోడింగ్ చేస్తున్నారు .. అయితే నయీమ్ రాసుకున్న వాటిని కోడ్ ను గుర్తించి నిపుణులు సహాయం తో అతడు రాసుకున్న కోడ్ వ్యవహారాలు అన్ని తర్జుమా చేస్తూ కొన్ని విషయాలు బయటికి తీశారు ..

టెర్రర్ బాస్ .. చింటూ సార్ ఎవరు .. ?
అయితే నయీమ్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీ లో ” టెర్రర్ బాస్ , చింటూ సార్ ” అని రాసుకునట్లు సమాచారం .. అయితే టెర్రర్ బాస్ అనే నయీమ్ కు చాలా అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ పోలీస్ అధికారి అయ్యి ఉండవచ్చు అని పోలీసులు ఒక నిర్ధారణ కు వచ్చారు .. అయితే చింటూ సeర్ అని కూడా రాసుకోవడం తో చింటూ సర్ , రాజకీయ నేత లేక పోలీస్ అధికారేనా అనే విషయం పై పరిశీలిస్తున్నారు …ఈ కోడ్ లాంగ్వేజ్ ని డీ కోడింగ్ చేయడం చాలా కష్టం అంటున్నారు నిపుణులు .. ఎందుకంటే తన వ్యక్తి గతం కాబట్టి కొన్ని మాత్రమే కోడ్ లాంగ్వేజ్ ను డీ కోడ్ చేస్తే ఫలితాలు వస్తాయి కానీ , పూర్తి ఫలితాలు వస్తాయి అనేది మాత్రం నిజం కాదు .. కోడ్ లాంగ్వేజ్ లో ఉన్న భాషను వ్యక్తి బతికి ఉంటే అతడు చెప్పే విధింగా దర్యాప్తు చేసి .. దాని ద్వారా డీ కోడ్ చేయవచ్చు .. అయితే వ్యక్తి చనిపోతే మాత్రం కోడింగ్ ఉన్న విషయాలు , డీ కోడ్ చేయడం చాలా కష్టం అంటున్నారు మాజీ పోలీస్ అధికారులు.

SHARE