Posted [relativedate]
బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి ప్రక్షాళన మొదలయ్యిందని చెప్పాలి. ట్రైలర్ లో శత్రు సైన్యాలకే కాదు తనకు ఎదురొచ్చే ప్రతి ఒక్కరిని బాలయ్య బాబు తన మార్క్ వార్నింగ్ ఇచ్చాడని కనిపిస్తుంది. భళా అనిపించేలా శాతకర్ణి ట్రైలర్ తో తన ప్రతిభతో ఆకట్టుకున్న దర్శకుడు క్రిష్ ఇదేముంది సినిమాలో ఇలాంటివి చాలా ఉన్నాయంటున్నాడట. ఇక నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలకు మించి ఉండటంతో కేవలం 4.5 గంటల్లోనే మిలియన్ మార్క్ క్రాస్ చేసింది.
ఈమధ్య వచ్చిన ట్రైలర్స్ లో ఇదో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుందని చెప్పొచ్చు. ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ క్రిష్ క్రియేటివిటీకి అద్దం పడుతున్నాయి. రెండు నిమిషాల్లో రెండు గంటల సినిమా చూపించిన క్రిష్ బాలయ్య చేత డైలాగులను కూడా ఓ రేంజ్ లో చెప్పించాడు. శాతకర్ణి సినిమా మీద అభిమానులు పెట్టుకున్న అంచనాలన్ని రెట్టింపయ్యేలా చేసిన ఈ ట్రైలర్ కేవలం 4 గంటల్లోనే అరుదైన రికార్డ్ సొతం చేసుకుంది.
ఇక సంక్రాంతి రేసులో సత్తా చాటేందుకు దిగుతున్న బాలయ్య ఏవిధంగా సంచలనాలను సృష్టించడం ఖామనిపిస్తుంది. బాలయ్య ఉగ్ర నరసింహ రూపాన్ని శాతకర్ణిలో చొప్పించి తెలుగు తెర మీద ఎన్నడూ చూడని ఓ కథను చూపించబోతున్నారు. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు ఏ రకమైన నీరజనాలు అందిస్తారో చూడాలి.