ఆగస్ట్‌ లో నాగశౌర్య ‘నీ జతలేక’..

0
541
naga-sourya
యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా, పారుల్‌, సరయు కథానాయికలుగా ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు సమర్పణలో శ్రీ సత్య విదుర మూవీస్‌ బ్యానర్‌పై లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజుగౌడ్‌ చిర్రా నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘నీ జతలేక’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 13న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
జూలై 27న ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ 
ఈ సందర్భంగా నిర్మాతలు జివి.చౌదరి, నాగరాజుగౌడ్‌ చిర్రా మాట్లాడుతూ – ”ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య లేటెస్ట్‌గా ఒక మనసు వంటి ఫీల్‌గుడ్‌ మూవీస్‌ తర్వాత హీరో నాగశౌర్య మా బేనర్‌లో చేస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ప్రజెంట్‌ ట్రెండ్‌కి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ లారెన్స్‌ దాసరి చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇటీవల ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ స్వరాజ్‌ సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ అందించారు. జూలై 27న హైదరాబాద్‌ సినీమ్యాక్స్‌లోని బ్లూఫాక్స్‌ రెస్టారెంట్‌లో ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్‌ 13న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు. 
దర్శకుడు లారెన్స్‌ దాసరి మాట్లాడుతూ – ”ఒక మంచి సినిమా చెయ్యడంలో మా నిర్మాతలు తమ వంతు సహకారాన్ని అందించారు. హీరో నాగశౌర్య, హీరోయిన్లు పారుల్‌, సరయులకు ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. స్వరాజ్‌ సారధ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై చాలా పెద్ద హిట్‌ అయింది. చిత్రంలోని ప్రతి పాటని చాలా అద్భుతంగా చేశారు స్వరాజ్‌. ఆగస్ట్‌ 13న రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకు వుంది” అన్నారు. 
చిత్ర సమర్పకుడు వేమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ – ”ఇప్పటివరకు నాగశౌర్య చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన సినిమా ‘నీ జతలేక’. ఆల్రెడీ ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. దాంతో సినిమాపై మాకు వున్న నమ్మకం మరింత పెరిగింది. యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకునే ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 13న విడుదల చేస్తున్నాం” అన్నారు. 
నాగశౌర్య, పారుల్‌ గులాటి, సరయు, విస్సురెడ్డి, జయలక్ష్మి, ఆర్క్‌ బాబు, నామాల మూర్తి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్వరాజ్‌, సినిమాటోగ్రఫీ: బుజ్జి.కె, మాటలు: శేఖర్‌ విఖ్యాత్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, ఆర్ట్‌: సత్య, పాటలు: రామ్‌ పైడిశెట్టి, గాంధీ, కో డైరెక్టర్‌: బి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.శ్రీధర్‌, సమర్పణ: ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు, నిర్మాతలు: జి.వి.చౌదరి, నాగరాజు గౌడ్‌ చిర్రా, దర్శకత్వం: లారెన్స్‌ దాసరి. 

Leave a Reply