రాష్ట్రపతి పదవికి అభ్యర్థి కావలెను..!

0
554
need a member to president of india

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]need a member to president of india

రాష్ర్టపతి అంటే భారతదేశానికి ప్రథమ పౌరుడు. దేశానికి వన్నెతెచ్చిన వ్యక్తి అయి ఉండాలి. కానీ… అలాంటి పదవికి ఇండియాలో తగిన వ్యక్తులే లేరా? రాజకీయ పార్టీల వెతుకులాట చూస్తుంటే అదే అనిపిస్తోంది. అధికార పక్షం నుంచి విపక్షం వరకు రోజుకో పేరు… అదికూడా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన వారు కాకుండా ముక్కూమొఖం తెలియిని పేర్లను ప్రచారంలోకి తెస్తుండడంతో సగటు భారతీయుడికి ఇప్పుడిదే అనుమానం వస్తోంది.

రాష్ర్టపతి పదవికి సరైన అభ్యర్థి ఎవరా అని కాగడాపట్టి వెతుకుతున్నారు అటు ఎన్.డి.ఎ. ఇటు యు.పి.ఎ. నాయకులు. ఒకప్పుడు ఎన్.డి.ఎ. పడిన కష్టాలే ఇపుడు యు.పి.ఎ. పడుతోంది. యు.పి.ఎ.కి మెజారిటీ ఉన్న రోజుల్లో రాష్ర్టపతి ఉపరాష్ర్టపతి పదవులకు తగిన అభ్యర్థి ఎవరా అని వెతుక్కునేది ఎన్డీయే. ఇపుడు స్ఠానాలు మారాయి. ఎన్.డి.ఎ. బలపడింది యు.పి.ఎ.కి రాష్ర్టపతి అభ్యర్థి దొరకడం లేదు.

పవార్ అపుడే నో అనేశాడు. నితీష్ కుమార్కి ప్రధాని పదవి మీద ఆశ ఉందేమో కానీ రాష్ర్టపతి పదవిమీద ఏమాత్రం ఆసక్తి లేదు. కాబట్టి హాయిగా ఉన్న సి.ఎం. పదవిని వదులుకోవడానికి ఆయన సిద్దంగా లేరు.ఇక ఎన్బీయే తరపున అభ్యర్థి విషయంలోనూ ఇదే పరిస్థితి. దేశ్ కీ నేతాగా పేరున్న అద్వానీ అయితే బాగుంటుందని బీజేపీలో ఒక వర్గం దేశంలో చాలామంది ప్రజలు కూడా అనుకుంటున్నారు. అద్వానీ ఆ స్థాయి వ్యక్తనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ… మోడీ అద్వానీకి ఆ ఛాన్సు ఇచ్చే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు.ఒడిశాలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ఆ రాష్ర్ట ప్రజలను ఆకట్టుకునేందుకు గిరిజన మహిళానేత ద్రౌపది ముర్ము పేరు తెరపైకి తెస్తోంది. కానీ… ఆమె గురించి ఆ రాష్ర్టంలోనే అందరికీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో రాష్ర్టపతి పదవికి తగినవారు లేనే లేరా అన్న వాదన వినిపిస్తోంది.

Leave a Reply