కొరియా తెరపై అందాల నీతూ

0
540

neethu1
పుష్కరకాలంగా తెలుగు-తమిళం-కన్నడ-హిందీల్లో పలు సినిమాలు చేసింది నీతూచంద్ర. విష్ణు, గోదావరి, సత్యమేవ జయతే, మనం సినిమాల ద్వారా ఈ సుందరాంగితో మనకి మంచి పరిచయమే ఉంది. నీతూ బహుముఖ ప్రజ్ఞాశాలి అనే చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్, రంగస్థల నటి, క్రీడాకారిణి, తైక్వాండోలో బ్లాక్ బెల్డ్ గ్రహీత… ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆమె గురించి చాలా ప్రత్యేకతలే ఉంటాయి. మిథిల మకాన్ సినిమాకి గానూ సొంత ప్రొడక్షన్ హౌజ్‌ ‘చంపారన్ టాకీస్’ 2015లో జాతీయ అవార్డును సైతం కైవసం చేసుకుంది.

ప్రస్తుతం భారత్‌లో బాస్కెట్‌బాల్‌కు ప్రాచుర్యం కల్పించే పనిలో ఉన్న నీతూకు ఓ కొరియన్ యాక్షన్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. తైక్వాండో యాక్ట్‌లో అమ్మడికి ఫోర్త్ డాన్ బ్లాక్ బెల్డ్ ఉంది. ఆమె టాలెంట్‌కు ముగ్ధుడైన కొరియా ఫిల్మ్‌ మేకర్ ఒకరు తమ మూవీలో ఓ రోల్‌ను ఆఫర్ చేశారు. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన అధికంగా ఉంటుందట. అందుకే నీతూను తమ చిత్రంలో నటింపజేయాలని ఆయన ఆశిస్తున్నారట. ఇండియాలో ఛాన్స్‌లు లేకపోయినా విదేశీ సినిమాల్లో ఆఫర్స్‌ వస్తున్నాయని నీతూ సంబరపడిపోతోందని టాక్.

Leave a Reply