కోర్టు ఆవరణలో బాంబ్ పేలుడు…

    nellore district court outside bomb blast

జిల్లాకోర్టు ఆవరణలో బాంబు పేలుడు కలకలం రేపింది. మూడో అదనపు కోర్టు ఎదుట భారీ శబ్ధంతో బాంబు పేలింది. గుర్తుతెలియని దుండగులు కుక్కర్లో బాంబు పెట్టి పేల్చారు. బాంబు పేలుడు దాటికి కోర్టు ఆవరణలోని గోడ ధ్వంసమయింది. కోర్టు ఆవరణలో ఎవరు లేకపోవటంతో ప్రాణనష్టం తప్పింది. బాంబు పేలుడు వల్ల ఎవరికి ఎలాంటి హానీ జరగకపోవడంతో కోర్టు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలాన్ని జడ్జి శ్యామలాదేవి పరిశీలించారు. విషయం తెలిసుకున్న పోలీసులు బాంబు పేలిన ప్రాంతాన్ని క్షుణంగా పరిశీలించారు. బాంబును ఎవరు పేల్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

SHARE