యు/ఎ ను దక్కించుకున్న “నేను లోకల్”

0
484
nenu local crossed u/a sensor board

Posted [relativedate]

nenu local crossed u/a sensor boardమజ్ను, జెంటిల్ మన్ వంటి హ్యాట్రిక్ విజయాలతో నాని మంచి జోష్ మీద ఉన్నాడు. ఈ జోష్ తో నాని చేస్తున్న తాజా చిత్రం నేను లోకల్. త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న  ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోయే ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్‌ హీరోయిన్ గా నటించింది.

 కాగా ఈ సినిమాకు  సెన్సార్‌ బోర్డు ‘యు/ఎ’ ను ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు  తెలిపిన నాని…  బాబు గాడి లవ్‌ స్టోరీకి స్టేజ్‌ సెట్‌ అయిందని ఓ పోస్ట్‌ ను పెట్టారు. మరి నానికి నేను లోకల్ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Leave a Reply