నేను లోకల్ టీజర్ అదుర్స్..!

Posted November 12, 2016

nani1216ఈ సంవత్సరం ఇప్పటికే మూడు సినిమాలను రిలీజ్ చేసి హిట్ అందుకున్న నాని నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో నేను లోకల్ గా రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక కొద్దిగంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సిని ప్రియులను అలరిస్తుంది. తన క్యూట్ లుక్స్ తో కీర్తి ఇంప్రెస్ చేయగా నాని రొమాంటిక్ మూడ్ లో కనిపించిన అలరించాడు.

నెల్లూరు బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు నాని. సినిమా చూపిస్త మావ తర్వాత త్రినాధ రావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై దిల్ రాజు భారీ అంచనాలే ఏర్పడేలా చేశాడు. ఓ క్యూట్ లవ్ స్టోరీతో వస్తున్న నేను లోకల్ 26 సెకన్ల టీజర్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ఈ ఇయర్ క్రిస్మస్ కు రిలీజ్ చేయబోతున్నారట.

SHARE