నయీం కేసులో తొలి వికెట్ TRS దే…

 Posted October 27, 2016

nethi vidyasagar connection with nayeemతెలంగాణా శాసనమండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్ పదవికి గండం తప్పదని వార్తలు వస్తున్నాయి. గ్యాంగ్ స్టర్ నయీం తో సంబందాలు ఉన్నాయన్న అంశంపై ఆయన గత కొంతకాలంగా వివాదంలో ఉన్నారు. పోలీసులు దాఖలు చేసిన నివేదికలో కూడా విద్యాసాగర్ ప్రస్తావన ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపద్యంలో విద్యాసాగర్ ను ఆ పదవి నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నట్లు కదనాలు వస్తున్నాయి.వచ్చే కౌన్సిల్ సమావేశాల నాటికి ఈ మార్పు ఉండవచ్చని అంటున్నారు.టిఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ కు చెందిన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ను మండలి ఉపాద్యక్షుడగా ఎంపిక చేయవచ్చని అంటున్నారు.విద్యాసాగర్ పదవికి ఉద్వాసన పలికితే నయీం కేసులో పడిన మొదటి వికెట్ అవుతుంది.

SHARE