గరం గరంగా నీతూ ఐటం..!

0
332

nc1316
కథానాయికగా అవకాశాలు అందని సమయంలో ప్రతి ఒక్క హీరోయిన్ తమలోని మరో యాంగిల్ ను అదేనండి ఐటం వేశాలను బయట పెట్టడం కామనే.. కాస్త ఫేడవుట్ అవుతున్నాం అనుకున్న టైంలో మాంచి ఊపున్న ఐటం సాంగ్ తో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తే ఆ క్రేజ్ తో మరో ఐదు సంవత్సరాల కెరియర్ సరి చేసుకున్నట్టే. అయితే ప్రస్తుతం అదే ప్లాన్లో ఉంది ఫేడవుట్ హాట్ బ్యూటీ నీతూ చంద్ర. శేఖర్ కమ్ముల గోదావరి సినిమాలో నటించి మెప్పించిన ఈ చిన్నది కోలీవుడ్లో హాట్ ఇమేజ్ ఏర్పరచుకుంది. అంతేకాదు బాలీవుడ్ గరం మసాలా సినిమాలో బికినితో కేక పెట్టించేసింది.

అందంతో పాటు కాస్త పొగరు కూడా ఎక్కువవడంతో అమ్మడు అవకాశాలను జారవిడుచుకుంది. అయితే ప్రస్తుతం సూర్య నటిస్తున్న సింగం-2 లో ఐటం సాంగ్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది నీతూ చంద్ర. బాలీవుడ్లో బికినితో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఇక్కడ కూడా తన పరువాలను చూపించేందుకు సిద్ధమైంది. ఒకవేళ సినిమాలో ఈ సాంగ్ క్లిక్ అయితే మళ్లీ ట్రాక్ ఎక్కేయాలని అమ్మడి ఆలోచన. సో గరం గరం ఐటం సాంగ్ తో రాబోతున్న నీతూ చంద్ర ఆ సాంగ్ తో ఎలాంటి క్రేజ్ సంపాదిస్తుందో చూడాలి.

Leave a Reply