ఒక్క టాబ్లెట్… రెండు వారాలు

Posted [relativedate]

newcapsuleac
ఒక్కసారి మింగితే రెండు వారాలు పనిచేయడమేంటి అనకుంటున్నారా.. నిజమే.. ఎవరికైనా మలేరియా వస్తే ఏం చేస్తారు.. డాక్టర్‌ చాంతాడంత మెడిసిన్స్‌ లిస్ట్‌ రాసి ఒక్క రోజు కూడా మిస్‌ కాకుండా వాడమనేవారు కదా.. ఇప్పుడు అలాంటి బాధలకు చెక్‌ చెప్పేలా అమెరికాకు చెందిన మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) సంస్థ కొత్త మాత్రను కనిపెట్టింది.. దానిపై ప్రయోగాలు కూడా చేసింది.. ఒక్కసారి ఈ మాత్ర వేసుకుంటే కడుపులో అలానే ఉండి మెడిసిన్‌ అవసరమైనప్పుడల్లా విడుదల చేస్తుంది.. దాంతో సమయానికి మర్చిపోతామనే భయం కూడా ఉండదు.. ఇలా దాదాపు రెండు వారాలపాటు మెడిసిన్‌ని విడుదల చేస్తుందట.. మలేరియా వంటి వ్యాధులకు ఇది చాలా చక్కగా పనిచేస్తుందని చెబుతుంది. దీనిలో పాల్గొన్న పరిశోధకలు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న చాలా వ్యాధులకు ఇదో గొప్ప పరిష్కారమని తేల్చారు.. అబ్బా ఇది త్వరగా వస్తే బావుంటుంది కదా.. వారం రోజుల కోర్సు వాడమన్నప్పుడు ఓపిక చేసుకుని ఇదొక్కటి వేసుకుంటే చాలు అది నయం అయ్యేదాక ఆ టాబ్లెట్లే చూసుకుంటుంది ఎంచక్కా….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here