చుక్కల్లో పవర్ స్టార్!!

Posted March 18, 2017

new couple in karnataka saw the pawan kalyan photo in the place of arundhathi star
పవన్ స్టార్ పవన్ కల్యాణ్ చుక్కల్లో ఉండడమేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజంగానే పవన్ కల్యాణ్ నక్షత్రంగా మారిపోయారు… అదేంటి సంబంధం లేకుండా ఈ టాపిక్ అని అనుకుంటున్నారా? అయితే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే!!

కర్ణాటకకు చెందిన ఓ జంటకు పెళ్లికి కుదిరింది. వధూవరులిద్దరికీ పవన్ అంటే విపరీతమైన అభిమానం. పవర్ స్టార్ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే చూడాల్సిందే!! అలాంటి ఈ ఇద్దరూ పెళ్లి సమయంలో పవన్ పై అభిమానాన్ని డిఫరెంట్ చాటుకోవాలని నిర్ణయించారు.

పెళ్లయిన తర్వాత సంప్రదాయం ప్రకారం వధూవరులిద్దరూ అరుంధతి నక్షత్రాన్ని చూడడం ఆనవాయితీ. అసలే ఈ జంట పవన్ ఫ్యాన్స్ కాబట్టి.. అభిమానం హద్దులను దాటేసింది… ఇంకేముంది అటు పెళ్లి అయ్యిందో లేదో… అరుంధతి నక్షత్రం ప్లేసులో పవన్ కల్యాణ్ ఫోటోను చూస్తామని ఇద్దరూ పట్టుబట్టారు.

వధూవరుల కోరిక మేరకు ఇరు కుటుంబాల వారూ పవర్ స్టార్ ది అదిరిపోయే ఫ్లెక్సీని రెడీ చేశారు. అరుంధతి నక్షత్రం ప్లేసులో పవన్ కల్యాణ్ దర్శనం చేసుకున్నారీ జంట. పెళ్లికొచ్చిన అతిథులకు మొదట విషయం అర్థం కాకపోయినా… చివరకు వధూవరుల అభిమానాన్ని అర్థం చేసుకున్నారు. పవన్ ఫ్యాన్స్ అంటే ఆమాత్రం డిఫరెంట్ కోరికలు సహజమేనంటూ ముసిముసిగా నవ్వుకున్నారు.

SHARE