త‌మిళ‌నాడు సీఎం రేసులో కొత్త‌వ్య‌క్తి!!

0
264
new person into cm race in tamilnadu

Posted [relativedate]

new person into cm race in tamilnadu
త‌మిళ‌నాడు సీఎం రేసులో ఉన్న‌ది ఇద్ద‌రే ఇద్ద‌రు. ఒకరు ప‌న్నీర్ సెల్వం అయితే మ‌రొక‌రు శ‌శిక‌ళ‌. అయితే ఇప్పుడు మ‌రో కొత్త వ్య‌క్తి పేరు తెర‌పైకి వ‌చ్చింది. అత‌నే శ‌శిక‌ళ వ‌ర్గానికి చెందిన సెంగొట్ట‌య‌న్.

నిజానికి శ‌శిక‌ళ సీఎం అవుతాన‌ని చెప్పిన‌ప్ప‌టి నుంచే అన్నాడీఎంకేలో ముస‌లం పుట్టింది. కానీ ఆమె ఊహించ‌ని విధంగా ప‌న్నీర్ సెల్వం తిరుగుబాటు చేయ‌డం.. ఆ త‌ర్వాత క్యాంప్ రాజ‌కీయాలు.. అనంత‌రం కొంత‌మంది ఆమెకు హ్యాండిచ్చి… సెల్వంకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం ఇవ‌న్నీ చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి. ఇటు చూస్తే ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రుగా చేజారిపోతున్నారు. అటేమో సెల్వం ద‌గ్గ‌ర చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. అన్ని వ‌ర్గాల్లోనూ త‌న‌పై వ్య‌తిరేక‌త పెరుగుతుండ‌డం శశికి అర్థ‌మైంది. ఇక లాభం లేద‌ని చిన్న‌మ్మ కొత్త ఎత్తు వేసింది. సెల్వంను చిత్తు చేసేందుకు… త‌న‌పై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు సెంగొట్ట‌య‌న్ పేరును తెర‌పైకి తెచ్చింది.

ఎమ్మెల్యేల స‌మావేశంలో శ‌శిక‌ళ స్వ‌యంగా సెంగొట్ట‌య‌న్ పేరును ప్ర‌తిపాదించిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. త‌న‌పై ఎలాగూ వ్య‌తిరేక‌త ఉంది… కాబ‌ట్టి అత‌న్ని సీఎంను చేద్దామ‌ని చెప్పింద‌ట‌. దానికి ఎమ్మెల్యేల నుంచి ఆశించిన స్పంద‌న రాలేద‌ని స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ చిన్న‌మ్మ మాత్రం త‌న కంటే… త‌న శిష్యుడిని కూర్చోబ‌డితేనే చ‌క్రం తిప్ప‌గ‌ల‌న‌ని యోచిస్తున్నార‌ట‌. సెంగొట్ట‌య‌న్ అయితే… తాను చెప్పినంటే వింటాడు. అధికారికంగా మాత్ర‌మే అత‌ను ముఖ్య‌మంత్రిగా ఉంటాడు. కానీ నిర్ణ‌యాధికారాల‌న్నీ తీసుకునేవ‌న్నీ ఎలాగూ తానే… కాబ‌ట్టి ఇదే వ్యూహంతో సెల్వంకు చెక్ పెట్టేందుకు చిన్న‌మ్మ గ‌ట్టిగానే ఆలోచిస్తున్నార‌ని టాక్.

అయితే శ‌శిక‌ళ కాకుండా మ‌రో వ్య‌క్తిని ఆమె ముఖ్య‌మంత్రిగా ప్ర‌తిపాదిస్తే.. ప‌రిణామాలు ఎలా ఉంటాయో ఊహించ‌డం క‌ష్టం. ప్ర‌స్తుతానికి ఎమ్మెల్యేలు చిన్న‌మ్మ‌కు జై కొడుతున్నా…ఈ లొల్లి మ‌న‌కెందుకు… సెల్వం సారుకే మ‌ద్ద‌తివ్వాల‌ని నిర్ణ‌యించుకుంటే మాత్రం శ‌శికి క‌ష్ట‌మే!!!

Leave a Reply