‘చిన్నమ్మ’ పార్టీ…

0
762

next chief minister tamilnaduమీ తరువాత ఎవరు..? మీ వారసుడెవరు..? ఈ ప్రశ్నలు నాటి రాజరికం నుంచి నేటి ప్రజాస్వామ్యం దాకా.. అధికారంలో వున్నవాళ్లు తప్పక ఎదుర్కొనే ప్రశ్న.. నాయకుల వయసు మళ్ళాక అసలు ఈ ప్రశ్నే అన్నిటికన్నా ముందుంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం స్టాలిన్ అని చెప్పినందుకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఎదుర్కున్న కష్టం చూశాం కదా! కరుణ నిర్ణయంతో ఆగ్రహించిన పెద్దకొడుకు అళగిలి మొత్తం కంపుకంపు చేసేశాడు.. దక్కుతుందునుకొన్న అధికారం కాస్తలో తప్పిపోయింది.

అధికారం దక్కించుకున్న జయమ్మకు కూడా మళ్లీ ఇవే కష్టాలు వచ్చి పడుతున్నాయి. వయసు ఆరోగ్యం రీత్యా వారసత్వ ప్రశ్న తమిళనాట ప్రముఖంగానే విన్పిస్తోంది. రేసులో నమ్మిన బంటుగా పేరుపడి ఆర్థికశాఖ నిర్వహిస్తున్న పన్నీరు సెల్వం.. అంతఃపుర రాజకీయాల్లో ఆరితేరిన నెచ్చెలి శశికళ పేర్లు ముందుకొస్తున్నాయి. అమ్మ తర్వాత చిన్నమ్మ అంటూ శశికళ అభిమాని ఒకరు ప్రచారం కూడా మొదలుపెట్టేశాడు.. ఎవరూపట్టించుకోవడం లేదని కావచ్చు ఏకంగా ‘చిన్నమ్మ ‘పేరుతో కొత్తపార్టీ స్థాపించేశాడు.. ఏదేమైనా మళ్లీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులైనా కాకముందే జయమ్మకు కరుణ కష్టాలు ఎదురవుతున్నాయి అంటే .. రాజకీయం.. అంతేమరి..

Leave a Reply