వచ్చేనెల్లోఎన్టీఆర్ కొత్త మూవీ..

 next month ntr new movie going setsఎన్టీఆర్ తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’ వచ్చేనెల 2వ తేదీన విడుదల కానుంది. దీంతో తదుపరి సినిమా షూటింగ్ కి సన్నాహాలు ప్రారంభమైపోయిన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ వక్కంతం వంశీ డైరక్షన్‌లో ఒక మూవీ చేయనున్నట్టు కొంతకాలం క్రితమే వార్తలు వచ్చాయి. ఈ చిత్రానికి సంబంధించిన సన్నాహాలను వక్కంతం వంశీ స్టార్ట్ చేసేశాడనేది తాజా సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి.

ప్రస్తుతం నటీనటులు .. సాంకేతిక నిపుణుల సెలక్షన్‌పై దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాను, అక్టోబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో వున్నారు.

SHARE