వచ్చే నెల్లో క్యాబినెట్ రీ షఫుల్…ఆ మంత్రి కి ఊస్టింగ్?

0
529
next month ravela is going to loose the post

Posted [relativedate]

next month ravela is going to loose the post
రావెల కిషోర్ బాబు …రాజకీయాలకి కొత్త అయినా ప్రత్తిపాడు నియోజకవర్గంలో గెలుపుతో సీఎం చంద్రబాబు దృష్టిని ఆకర్షించేసారు.అందుకే గెలిచీగెలవగానే క్యాబినెట్ బెర్త్ కొట్టేశారు.తొలి ఆరునెలలపాటు ఏ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరకెళ్ళినా రావెలని చూసి నేర్చుకోమని చెప్పేవారట చంద్రబాబు.అది తెలిసి మంత్రి గారికి అహం పెరిగిందో …లేక కాలమే ఎదురు తిరిగిందో కానీ అప్పటి నుంచి అన్ని ఎదురు దెబ్బలే.ఓ మహిళని ఏడిపిస్తూ రావెల కొడుకు హైదరాబాద్ లో అడ్డంగా దొరికిపోయాడు.ఆ తరువాత ఇంకోసారి గుంటూరు లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ మహిళా హాస్టల్ ముందు రావెల కొడుకు వీరంగం గురించి మీడియా కోడై కూసింది.అబ్బా పుత్ర రత్నాలతో మంత్రి రావెలకి ఇబ్బందులు తప్పడం లేదే అనుకునేంతలో ఓ కుదుపు.సాక్షాత్తు ఓ మహిళా ప్రజాప్రతినిధి తనకు,తన కుటుంబానికి మంత్రి రావెల తో ప్రాణభయం ఉందని వాపోయారు.విషయం రచ్చకెక్కి సీఎం కలగజేసుకుంటే అప్పటికి అప్పుడు ఏదో రాజీ ఫార్ములా తో మమ అనిపించారు.

పైకి రాజీ కుదిరినట్టు అనిపించినా లోలోన రగులుతూనే వుంది.దానికి సంబంధించి అధిష్టానం ముందు పరస్పరం ఫిర్యాదులు సాగుతూనే వున్నాయి.ఈ వ్యవహారంతో అధిష్టానం తల బొప్పి కట్టింది.తాజాగా వట్టిచెరుకూరు మండలానికి చెందిన నేతలు కొందరు లోకేష్ ని కలిసి రావెల వ్యవహారశైలిపై మొర పెట్టుకున్నారు.పార్టీ కోసం ఆదినుంచి పనిచేసిన వారిని పక్కనబెడుతున్నారని ఆయనకు చెప్పుకున్నారు.వారి మాటలన్నీ శ్రద్ధగా విన్న లోకేష్ ఇలా స్పందించారట ’15 రోజుల్లో రావెలపై మీరు ఊహించని చర్యలుంటాయి’.లోకేష్ స్పందన చూసిన ఆ మండల స్థాయి నేతలు రావెల కి క్యాబినెట్ నుంచి ఊస్టింగ్ తప్పదని సంబరాలు చేసుకుంటున్నారు.అదే నిజమైతే మరో 15 రోజుల్లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్నమాట.

Leave a Reply