త్రిష చిత్రానికి అనుష్క నిర్మాత!…

Posted October 13, 2016

 nh10 tamil remake trisha heroine anushka sharma producer

అనుష్క శర్మ లీడ్ రోల్ లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘ఎన్.హెచ్.10’. గత యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ద్వారా అనుష్క నిర్మాతగా కూడా మారింది. ఆమె ఆశలని ‘ఎన్.హెచ్.10’ ఏమాత్రం వమ్ము చేయలేదు. అనుష్క న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఇప్పుడీ
చిత్రం తమిళ్ రిమేక్ కి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

త్రిష లీడ్ రోల్ లో  ‘ఎన్.హెచ్.10’ తెరకెక్కనుంది. బాలీవుడ్ లో నిర్మాతగా వ్యవహరించిన అనుష్క శర్మ.. తమిళ్ రిమేక్ ని కూడా నిర్మించనుంది. ఈ చిత్రం
త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పెద్దగా అవకాశాల్లేని త్రిషకి.. ఇదో బిగ్ ఛాన్స్ అనే చెప్పాలి. మరి.. ‘ఎన్.హెచ్.10’ హైవే పైనా త్రిష హడావుడి ఏ రేంజ్ లో ఉండనుందో చూడాలి.

SHARE