మెగాస్టార్ మూవీలో మెగా డాటర్..!

niharika guest role

మెగాస్టార్ నటిస్తున్న ఖైది నెంబర్ 150లో మెగా డాటర్ నిహారికె గెస్ట్ రోల్ చేస్తుందా అంటే అవునని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మెగా ఫ్యామిలీ నుండి హీరోలే కాదు హీరోయిన్స్ కూడా వస్తారంటూ ముందడుగేసిన నిహారిక మొదటి సినిమా ఒక మనసు ఫ్లాప్ అయినా సరే ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయ్. ఇప్పటికే వెబ్ సీరీస్, టివి హోస్ట్ గా క్రేజ్ సంపాదించిన నిహారిక హీరోయిన్ గా కూడా బెస్ట్ అనిపించుకుంది. తనకు మెగాస్టార్ తర్వాతనే ఎవరైనా అని పెదనాన్న మీద ప్రేమను చాటుకున్న మెగా డాటర్ అవకాశం వస్తే చిరు సినిమాలో ఏ చిన్న రోల్ అయినా చేస్తా అన్నది.

మరి అది దృష్టిలో పెట్టుకున్నారో ఏమో కాని నిహారిక చేత ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయిస్తున్నాడట వినాయక్. సినిమాలో అతి తక్కువ పాత్రే అయినా చాలా ప్రాముఖ్యత గల పాత్రగా ఉంటుందట. సో మెగా మూవీలో మెగాస్టార్ పక్కన మెగా డాటర్ ఇక ఫ్యాన్స్ కు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ప్రస్తుతం ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉన్న చిరు మూవీ నుండి రోజుకో అప్డేట్ అభిమానులు సినిమా మీద ఇంకా అంచనాలను పెంచుకునేలా చేస్తుంది.

SHARE