నిఖిల్‌ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు

0
499
nikhil is intelligence movie stories selecting

nikhil is intelligence movie stories selecting
‘హ్యాపీడేస్‌’ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నిఖిల్‌ ఆ తర్వాత కొన్నాళ్ల వరకు సాదారణ చిన్న చిత్రాలు చేస్తూ వచ్చాడు. నిఖిల్‌ స్థాయి ఇంతే అని, రెండు మూడు సంవత్సరాల్లో నిఖిల్‌ కనుమరుగవ్వడం ఖాయం అంటూ అంతా భావించారు. కాని నిఖిల్‌ చాలా తెలివిగా, ఏ సినిమా పడితే ఆ సినిమాను ఒప్పుకోకుండా, పారితోషికం విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా విమర్శకుల ప్రశంసలు పొందే సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

మంచి కథలు ఎంచుకున్నప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగలరని గతంలో పలువురు హీరోల విషయంలో నిరూపితం అయ్యింది. కమర్షియల్‌ సక్సెస్‌లు, భారీ పారితోషికాల విషయాన్ని ఆలోచించకుండా మంచి కథ, ఆ కథతో తనకు నటుడిగా మంచి గుర్తింపు వస్తుందని ఆశించి సినిమాలు చేసినప్పుడు మాత్రమే హీరోలకు మనుగడ ఉంటుంది. ఇక్కడ నిఖిల్‌ అదే పద్దతిలో ఆలోచిస్తున్నాడు. మంచి పాత్రలు ఎంచుకుంటూ, మంచి కథలను సినిమాలుగా చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న స్టార్‌ హీరోల జాబితాలో చేరాడు. తాజాగా నిఖిల్‌ నటించిన కేశవ సినిమా మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, నిఖిల్‌కు నటుడిగా మరింత పేరును తీసుకు రాబోతుందని ట్రైలర్‌ను చూస్తుంటేనే అనిపిస్తుంది.

Leave a Reply