పూరీ దర్శకత్వంలో జాగ్వార్ ?

Posted October 13, 2016

‘జాగ్వార్’తో తెరంగేట్రం చేశాడు నిఖిల్ గౌడ‌. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ‘జాగ్వార్’ జనాలని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో..  నిఖిల్ గౌడ‌ రెండో సినిమాని పక్కాగా ప్లాన్ చేసే పనిలో పడ్డారు. నిఖిల్ రెండో సినిమాని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ చేతిలో పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, దర్శకుడు వి.వి వినాయక్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడీ లిస్టులో దర్శకుడు పూరీ చేరిపోయారు. నిఖిల్ రెండో సినిమా పూరీ డైరెక్షన్ లో ప్లాన్ చేసున్నారంట. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి నిఖిల్ ఎంట్రీ పూరీ  చేతుల మీదుగా జరగాల్సి ఉంది. అప్పట్లో నిఖిల్ ఎంట్రీపై పూరీతో చర్చలు కూడా జరిగాయి. అయితే, కొన్ని కారణాల వల్ల  ఆ
సినిమా ఆగిపోయింది. ఇప్పుడు నిఖిల్ రెండో చిత్రం పూరీ దర్శకత్వంలో తెరకెక్కనుంది. మరి.. జాగ్వార్ ని పూరి ఎలా చూపిస్తాడో చూడాలి.

SHARE