జాగ్వార్ మూవీ రివ్యూ…

317
Spread the love

Posted [relativedate]

 nikhil jaguar movie review

చిత్రం : జాగ్వార్ (2016)
నటీనటులు : నిఖిల్ కుమార్, దీప్తి సతి
సంగీతం : ఎస్.ఎస్.థమన్
దర్శకత్వం : ఏ. మహదేవ్
నిర్మాత : అనితా కుమారస్వామి
రిలీజ్ డేట్ : 6అక్టోబర్, 2016.

మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి గౌడ తనయుడు నిఖిల్ కుమార్ గౌడ తెరంగేట్రం చేస్తోన్న చిత్రం “జాగ్వార్”.
రాజమౌళి శిష్యుడు ఏ. మహదేవన్ దర్శకుడు. రాజమౌళి తండ్రి విజయేంధ్ర ప్రసాద్ ‘జాగ్వార్’ కథని అందించారు. నిఖిల్ సరసన దీప్తిసతి జతకట్టనుంది. దాదాపు రూ. 70కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య దసరా కానుకగా ఈరోజు (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

‘జాగ్వార్’తో నిఖిల్ కుమార్ ని గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేశారు కుమార స్వామి గౌడ. తొలి చిత్రమే అయినా స్టార్ హీరో రేంజ్ లో బడ్జెట్ ఖర్చుపెట్టాడు. ప్రేక్షకులని ఆకట్టుకొన్ని అన్నీ అంశాలు ‘జాగ్వార్’ ఉండేలా జాగ్రత్తపడ్డారు. మిల్కీ బ్యూటీ తమన్నాతో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ని తెరకెక్కించారు. చిత్రీకరణే కాదు.. ప్రమోషన్స్ కు బాగానే ఖర్చు పెట్టారు. దాదాపు రూ.7కోట్లతో జాగ్వార్ ప్రమోషన్స్ కోసం ఖర్చు చేశారు. ఈ ఖర్చు, కేర్ కి ఒక్కటే రీజన్.. జాగ్వార్ ద్వారా నిఖిల్ కి గ్రాండ్ ఎంట్రీ లభించాలి.మరి..ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన’జాగ్వార్’ ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నాడు.నిఖిల్ నటన తో ఆకట్టున్నాడా.? ఇంతకీ జాగ్వార్ కథేంటో.. ?? తెలుసుకునేందుకు రివ్యూలోనికి వెళదాం పదండీ..

కథ :
జాగ్వార్ (నిఖిల్ కుమార్) న్యాయమూర్తి (ఆదిత్యమేనన్‌)ని చంపడంతో మొదలవుతుంది. చంపడమే కాదు.. ఎస్‌.ఎస్‌. టీవీ ఛానల్‌ ప్రసారాల్ని హ్యాక్‌ మర్డర్‌ని లైవ్‌గా చూపిస్తాడు. ఈ హత్యతో రాష్ట్రంలో కలకలం రేగుతోంది. ప్రభుత్వంపై ప్రెజర్ పెరుగుతోంది. దీంతో.. ఈ లైమ్ మర్డర్ మిస్టరీని చేధించడానికి ప్రభుత్వం సీబీఐ అధికారి (జగపతిబాబు)ని నియమిస్తుంది.

మరోవైపు, ఎస్.ఎస్.కృష్ణ (నిఖిల్ కుమార్) ఎస్‌.ఎస్‌. మెడికల్‌ కాలేజీ స్టూడెంట్. చాలా హుషారైన కుర్రాడు. తనతో పాటు చదువుతున్న ప్రియ(దీప్తి)ని
ప్రేమిస్తాడు. కాలేజీలో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఆర్య (అవినాష్‌) అనే విద్యార్థి గళం ఎత్తుతాడు. దీంతో.. ఆర్యని అడ్డుతొలగించాలని.. ఎస్‌.ఎస్‌ ఛానల్‌ అధినేత శౌర్య ప్రసాద్‌ (సంపత్‌ రాజ్‌) డిసైడ్ అవుతాడు. అందుకోసం ఎన్‌కౌంటర్‌ శంకర్‌ (కాట్రాజు)ని రంగంలోకి దింపుతాడు. ఇంతలో.. కాట్రాజుని జాగ్వార్‌ చంపేస్తాడు. ఇంతకీ జాగ్వార్ ఎవరు ? ఆ పేరేలా వచ్చింది.. ?? జాగ్వార్ ఎందుకు హత్యలు చేశాడు…??? ఎస్. ఎస్ కృష్ణ జాగ్వార్ ఒక్కటేనా.. ? ప్రియతో కృష్ణ లవ్ ఏమైంది..??? జాగ్వార్ పోసులకి దొరికాడా? అన్నది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* ఇండ్రక్షన్ స్టోరీ
* తమన్నా ఐటమ్ సాంగ్
* యాక్షన్ ఏపీసోడ్

మైనస్ పాయింట్స్ :
* సెకంఢాఫ్
* రొటీన్ స్టోరీ
* అక్కడక్కడ సాగదీత

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ అనగానే ‘జాగ్వార్’ పై అంచనాలు పెరగడం సాధారణమే. అయితే, విజయేంద్ర ప్రసాద్
అందించిన కథకి మహదేవ్ అల్లిన స్క్రీన్‍ప్లే సాదాసీదాగా ఉంది. అయితే, భారీ బడ్జెట్ సినిమాకి తగ్గట్టుగా సినిమాలోని భారీతనం ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తుంది. హీరో నిఖిల్ గౌడ ఫర్వాలేదనిపించాడు. డ్యాన్స్‌.. ఫైట్స్‌ అలా అన్నింటిలోనూ నిఖిల్ కి పాస్ మార్కులు పడతాయి. అయితే, నటనలో ఇంకా పరిణతి సాధించాల్సి ఉంది. హీరోయిన్ దీప్తి సతి  చేసిందేమీ లేదు. పాటల్లో మెరిసిందంతే. జగపతిబాబుని సరిగా వాడుకోలేదు. క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ ఇచ్చిన అప్పీయరన్స్ బాగుంది. ఎప్పటిలాగే రావురమేష్‌ తనదైన నటనటో ఆకట్టుకొన్నాడు.

సాంకేతికంగా :
జాగ్వార్ లుక్ పరంగా చాలా రిచ్. దర్శకుడు స్క్రిన్ ని మరింత పకడ్బంధీగా రాసుకోవచ్చు. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ హైలైట్. సినిమాకి పెద్ద అండగా
నిలిచింది. ఎస్. ఎస్. థమన్ మరోసారి దంచికొట్టిండు. కాకపోతే.. ఈసారి నేపథ్య సంగీతంతో ఆకట్టుకొన్నాడు. ఎడిటింగ్ ఓకే. బ్రహ్మీతో కామెడీ చేయించాలన్న ప్రయత్నం ఫలించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ హైలెవల్ లో ఉన్నాయి.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ : జాగ్వార్.. రిలీజ్ ముందు నుంచే క్రేజ్ ని సంపాందించుకొంది. ప్రమోషన్స్ లో చేసిన హడావుడితో ‘జాగ్వార్’ ఆసక్తి నెలకొంది. అయితే, ప్రమోషన్స్ పేల్చినంత రేంజ్ ‘జాగ్వార్’కి లేదు. కానీ.. జాగ్వార్ జస్ట్ ఓకే.

బాటమ్ లైన్ : జాగ్వార్.. జస్ట్ ఓకే చిత్రం
రేటింగ్ : 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here