తమిళ హీరోలకు షాక్ ఇచ్చిన నిఖిల్..!

Posted November 7, 2016

nk1716యువ హీరోల్లో నిఖిల్ తన సెపరేట్ స్టైల్ ను మెయింటైన్ చేస్తున్నాడు. స్వామిరారా తో తన కెరియర్ లో కొత్త టర్న్ తీసుకున్న నిఖిల్ ఇప్పుడు ప్రయోగాలకు పెద్ద పీట చేస్తున్నాడు. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న సినిమా ఎక్కడికిపోతావు చిన్నవాడ. టీజర్ తోనే సర్ ప్రైజ్ ఇచ్చిన ఈ సినిమా ఇప్పుడు తమిళ హీరోలకు షాక్ ఇస్తుంది. నవంబర్ 18న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎన్నో అంచనాలతో వస్తున్న తమిళ డబ్బింగ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనుంది.

విశాల్ ఒక్కడొచ్చాడు, బిచ్చగాడు హీరో విజయ్ ఆంథోని బెతాళుడు ఈ 18కే రిలీజ్ అవుతున్నాయి. అయితే అదే రోజు శ్రీనివాస్ రెడ్డి జయమ్ము నిశ్చయమ్మురా కూడా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాలన్నిటిలో నిఖిల్ సినిమాకే ఎక్కువ క్రేజ్ ఏర్పడనుంది. బిచ్చగాడు లాంటి హిట్ తో బెతాళుడుగా కూడా విజయ్ అదే రేంజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక విశాల్ కూడా రాయుడు తర్వాత ఒక్కడొచ్చాడుగా సత్తా చాటనున్నాడు. తమన్నా అందాలు ప్లస్ అవనున్న ఈ సినిమా తెలుగు మార్కెట్ పై కన్నేసింది. మరి ఈ రెండు సినిమాలు నిఖిల్ సినిమా ధాటికి నిలుస్తాయా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందే.

SHARE