స్వామిరారా…క్రైమ్ ,కామెడీ మిక్స్ తో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త బ్లెండ్ రుచి చూపించింది .నిఖిల్ కెరీర్ ను గాడిలో పెట్టింది.సుధీర్ వర్మ అనేకొత్త డైరెక్టర్ నుఇండస్ట్రీ కి పరిచయం చేసింది.ఈ సినిమా తరువాత ఎన్ఠీఆర్,రవితేజ లాంటి టాప్ హీరోలు సుధీర్ తో సినిమాకి ఆసక్తి చూపారు .కానీ వర్క్ అవుట్ కాలేదు . నాగచైతన్య తో దోచేయ్ వచ్చి ప్లాప్ అయ్యాక సుధీర్ కి సినిమా రాలేదు .
ఇక హీరో నిఖిల్ స్వామిరారా విజయాన్ని కొన్నాళ్ళు కొనసాగించినా ..శంకరాభరణం ఫెయిల్యూర్ తో ఆలోచనలో పడ్డాడు..సక్సెస్ అవసరమైన ఈ ఇద్దరి కాంబినేషన్ లో అభిషేక్ పిక్చర్స్ అధినేత ఓ సినిమా అనౌన్స్ చేశారు .సరికొత్త ప్రయోగం తో మళ్ళీ హిట్ కొట్టడానికి నిఖిల్,సుధీర్ ప్రయత్నిస్తున్నారు .స్వామిరారా కాంబినేషన్ తో సక్సెస్ ని రా..రమ్మని పిలుస్తున్నారు