కుర్ర హీరో కిర్రాక్ పార్టీ..

Spread the love

 Posted [relativedate]


యంగ్ హీరో నిఖిల్ కిర్రాక్ పార్టీ చేయబోతున్నాడు.అంత సందర్భం ఏముందబ్బా అని ఆలోచిస్తున్నారా? నిఖిల్ ఆ పార్టీ చేయడం వెనుక ఓ భారీ నిర్మాణ సంస్థ హ్యాండ్ కూడా వుంది. అదే ఏకే ఎంటర్ టైన్ మెంట్ సంస్థ . ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమానే కిర్రాక్ పార్టీ .కన్నడ లో పెద్ద హిట్ అయిన కిర్రాక్ పార్టీ రైట్స్ తీసుకున్న ఈ సంస్థ రాజు సుందరం దర్శకత్వంలో,నిఖిల్ హీరోగా ఈ సినిమాని త్వరలో పట్టాలెక్కించే పనిలో వుంది.నిఖిల్ ఈ సినిమాని ఒకే చేసాడంటే అందులో గట్టి మ్యాటర్ ఉందని వేరే చెప్పాలా ?ఈ మధ్య నిఖిల్ కధల విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటున్నాడో చూస్తున్నాం.శంకరాభరణం ఫెయిల్యూర్ తర్వాత ఇంకా జాగ్రత్త పెరిగింది.దాని ఫలితమే ఎక్కడికి పోతావు చిన్నవాడా సక్సెస్,తాజాగా కేశవ్ టీజర్ మీద వస్తున్న టాక్ .

చందు మొండేటి డైరెక్షన్ లో నాగ్ తో ఓ మల్టి స్టారర్ సినిమాకి ఒకే చెప్పిన నిఖిల్ షెడ్యూల్ లో వచ్చిన కొద్ది మార్పు కారణంగా ఇంకొంత టైం దొరికింది.ఈ టైం లో ఇంకో సినిమాకి అవకాశం ఉండటంతో కిర్రాక్ పార్టీ కి నిఖిల్ సై అన్నాడు.ఇక డైరెక్షన్ ఛాన్స్ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రాజు సుందరం కూడా కిర్రాక్ పార్టీ మీద భారీ హోప్స్ పెట్టుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here