మరో వివాదంలో వర్మ..!!

Posted March 21, 2017

nilesh girkar files case on ram gopal varma about sarkar 3 movieసెన్సేషన్ సినిమాలతో పాటు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. వర్మ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సర్కార్ -3 సినిమా  వచ్చేనెల వర్మ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

సర్కార్ -3 సినిమా ముంబైలోని శివసేన మాజీ చీఫ్ బాల్ థాక్రే జీవితకధ ఆధారంగా వర్మ  రూపొందిస్తున్నాడన్న కధనాలు వచ్చాయి. ఈ  నేపధ్యంలో సెన్సార్ బోర్డ్ థాక్రే ఫ్యామిలీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తే  తప్ప సినిమా రిలీజ్ చేయకూడదంటూ రూల్ పెట్టింది. ఇప్పుడు తాజాగా సర్కార్-3 మరోసారి చిక్కుల్లో పడింది.

ఈ సినిమాకు తానే  కధను అందించానంటూ నీలేష్ గిర్కర్ అనే ఓ స్క్రీన్ ప్లే రచయిత వర్మ మీద బాంబే హై కోర్టులో కేసు వేశాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని అలాగే ఫిల్మ్ టైటిల్స్ లో కూడా తన పేరు వేయలేదని నీలేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో సినిమా విడుదల ముందే నీలేష్ కి  ప్రత్యేకంగా షో వేసి చూపించాలని కోర్టు వర్మని ఆదేశించింది. అలానే రూ. 6.20 లక్షలు కోర్టులో డిపాజిట్ చేయాలని సూచించింది. మరి ఏప్రిల్ 7లోగా వర్మ  ఈ రెండు వివాదాల నుండి ఎలా బయటపడతాడో చూడాలి.

SHARE