‘స్పైడర్‌’కు ఉద్యమం ఎఫెక్ట్‌

0
476
nims hospital meet effects mahesh spider

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

nims hospital meet effects mahesh spider
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మురగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పైడర్‌’ చిత్రం క్లైమాక్స్‌ చిత్రీకరణ జరగాల్సి ఉంది. నిమ్స్‌ హాస్పిటల్‌లో చిత్రానికి సంబంధించి క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుపుతున్న సమయంలో కొంతమంది ఉద్యమకారులు నిమ్స్‌లో సరైన వసతులు కల్పిండంలో సరైన బాధ్యతతో ప్రవర్తించని యాజమాన్యం ఇలా షూటింగ్స్‌కు అద్దెకు ఇవ్వడం ఏంటని కొందరు ఆందోళన మొదలు పెట్టారు. దాంతో షూటింగ్‌కు అంతరాయం కలిగింది.

షూటింగ్‌ స్పాటల్‌లో ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తూ ఉండటంతో షూటింగ్‌కు అంతరాయం కలిగి పేకప్‌ చెప్పినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అక్కడ నిర్వహించాలనుకున్న సీన్స్‌ను వేరే చోట నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రత్యామ్నాయ స్పాట్‌ను ఎంపిక చేస్తామని వారు అంటున్నారు. షూటింగ్‌ ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటే ఇదో ఆలస్యం. జూన్‌లో విడుదల అవ్వాల్సిన ‘స్పైడర్‌’ సినిమా ఇప్పటికే ఆగస్టు లేదా సెప్టెంబర్‌కు వాయిదా పడ్డ విషయం తెల్సిందే.

Leave a Reply