నితిన్ ని గుర్తుపట్టడం కాస్త కష్టమే..

Posted March 30, 2017

Nithiin Next Movie as 'Lie' First Look Posterఇటీవల కాస్త డిఫరెంట్ చిత్రాలను చేస్తూ మళ్లీ యూత్ కి దగ్గరయ్యాడు నితిన్. తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ యూత్ స్టార్ చేస్తున్న సినిమా “లై”… లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి. ఈ సినిమాలో నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీ రోల్ చేస్తున్నాడు. అ ఆ సినిమా తర్వాత నితిన్ చేస్తున్న సినిమా కావడం, అలానే కృష్ణగాడి వీరప్రేమగాథ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో  ఈ సినిమా తెరకెక్కుతుండడంతో  ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచానాలే ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచే విధంగా ఈ రోజు నితిన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా  ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. గుబురు గడ్డంతో మాస్ లుక్ లో దర్శనమిచ్చిన నితిన్ ని గుర్తుపట్టడం కాస్త కష్టమే.

ఇప్పటివరకు నితిన్ ఈ రకమైన లుక్ లో కనిపించకపోవడంతో సినిమా గురించి మరింత ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది అభిమానులకు. అలానే టైటిల్ కూడా క్యూరియస్ గా ఉంది. లై అనే టైటిల్ ని కన్ఫామ్ చేసిన యూనిట్ సభ్యులు లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి అనేది ట్యాగ్ లైన్ గా ఉంచారు. ఇష్క్, దిల్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి చిత్రాలతో క్యూట్ అండ్ లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న నితిన్ ని ఇలా మాసీ లుక్ లో చూడాలంటే అభిమానులు  కాస్తంత ఇబ్బందిపడక తప్పదు. చూద్దాం.. ఈ డిఫరెంట్ గెటప్ నితిన్ కి ఎలాంటి హిట్ ని ఇస్తుందో .

SHARE