బర్త్ డే కి మాస్ లుక్ లో నితిన్…ఇట్ ఈజ్ “లై “

Posted March 30, 2017

nithin birthday special lie movie poster release
14 రీల్స్ సంస్థ నితిన్,హను రాఘవ పూడి కాంబినేషన్ లో సినిమా చేస్తోంది అనగానే ఓ స్పెషల్ ఇంటరెస్ట్ క్రియేట్ అయ్యింది.ఆ ఉత్సుకతని అంతకంతకు పెరుగుతోంది.నితిన్ తన కెరీర్ లో తొలిసారిగా గెట్ అప్ పరంగా పూర్తి భిన్నం గా కనిపించబోతున్నాడు.నితిన్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడంలో దర్శకుడు హను సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో నితిన్ గెట్ అప్ మాత్రమే కాదు టైటిల్ లోగో కూడా సరికొత్తగానే వుంది.”లై” అనే టైటిల్ నితిన్ పుట్టిన రోజున నేడు విడుదలైన ఆయన పోస్టర్ కి అప్ట్ గా వుంది.నితిన్ అంటే క్యూట్ అండ్ లవర్ బాయ్ గానే వూహించుకునేవారికి తాజాగా రిలీజ్ అయిన భారీ గడ్డంతో మాస్ లుక్ ఓ లై(అబద్ధం) అనిపిస్తుంది.

ఫస్ట్ లుక్ పోస్టర్,టైటిల్ లోగో తో స్వీట్ షాక్ ఇచ్చిన దర్శకుడు హను ఇంకో షాక్ కూడా బోనస్ గా ఇచ్చేసాడు.LIE కి అబద్ధం అర్ధమైతే టాగ్ లైన్ తో ప్రేక్షకుల్లో ఇంకాస్త క్యూరియాసిటీ పెంచాడు.లవ్,ఇంటలిజెన్స్,ఎనిమిటి అంటూ లై స్టోరీ లైన్ ఎలా వుండడబోతుందో చూచాయగా చెప్పేసాడు దర్శకుడు.మొత్తానికి’ అ ఆ ‘ సూపర్ డూపర్ హిట్ తర్వాత హీరో నితిన్, కృష్ణ గాడి వీర ప్రేమగాధ తర్వాత హను,14 రీల్స్ కలిసి చేస్తున్న ఈ సినిమా మీద ఇండస్ట్రీ లో మంచి అంచనాలు వున్నాయి.ఇప్పుడ్డు నితిన్ బర్త్ డే సందర్భముగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్,టైటిల్ లోగో ఆ అంచనాల్ని అందుకోవడమే కాదు …ఇంకాస్త పెంచాయి.నితిన్ కి తెలుగు బులెట్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.

SHARE