హీరోయిన్ పై మనసు పడ్డ నితిన్

0
472

Posted [relativedate]

ntn1416అఆ హిట్ తో హిట్ ట్రాక్ ఎక్కేసిన నితిన్ ప్రస్తుతం హను రాఘవపూడి డైరక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. సినిమాలో స్టార్ హీరోయిన్ ఉంటే ఆ సినిమాకు ఉండే మైలేజ్ ఏంటో అఆ సినిమాతో బాగా అర్ధం చేసుకున్న నితిన్ హను సినిమాకు ముందు కొత్త హీరోయిన్ తీసుకుందామని అనుకున్నా తను మాత్రం శృతి హాసన్ మాత్రమే కావాలని పట్టుపడుతున్నాడట. ఇప్పటికే గుండెజారి గల్లతయ్యిందే సినిమా సీక్వల్ గా శృతి ని అడిగారని టాక్.

అయితే ఆ సినిమా పట్టాలెక్కుతుందో లేదో అని శృతి హాసన్ హను సినిమాకే ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట నితిన్. ప్రస్తుతం కోలీవుడ్ మీద దృష్టి పెట్టి తెలుగులో అరకొర అవకాశాలతో సర్ధుకుంటున్న శృతి హాసన్ పవన్ కాటమరాయుడు తర్వాత ఏ సినిమా కమిట్ అవ్వలేదు. అందుకే నితిన్ శృతి కోసం అంతలా ఆరాటపడుతున్నాడు. హను కూడా నితిన్ కోరినట్టే శృతిని హీరోయిన్ గా ట్రై చేస్తున్నాడట. తను చేసిన రెండు సినిమాలకు కొత్త హీరోయిన్స్ ట్రై చేసిన హను ఈసారి శృతి హాసన్ ను డైరెక్ట్ చేయబోతున్నాడన్నమాట. డిఫరెంట్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా మీద నితిన్ చాలా నమ్మకంతో ఉన్నాడని తెలుస్తుంది.

Leave a Reply