స్పీడ్ పెంచేసిన నితిన్..!!

0
610
nithin speed up with movies

Posted [relativedate]

nithin speed up with moviesసై సినిమా తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేని నితిన్ కెరీర్ ని మళ్లీ దారిలో పెట్టింది ఇష్క్ సినిమా.  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమా నితిన్ ని 50కోట్ల క్లబ్ లో జాయిన్ చేసింది. గతేడాది విడుదలైన  ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఈ సంవత్సరం మాత్రం స్పీడ్ ని అమాంతం పెంచేశాడు.

 ప్రస్తుతం హనురాఘవపూడి దర్శకత్వంలో డిఫరెంట్ లుక్ లో నటిస్తున్న నితిన్… కృష్ణ చైతన్య దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు సినిమాలతో పాటు తాజాగా  మరో సినిమాను కూడా ప్రారంభించేశాడు. బెంగాల్ టైగర్ సినిమా నిర్మాత  కె.కె.రాధామోహన్  నిర్మించనున్న ఈ  భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఆగస్టు నుంచి ఈ కొత్త సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నామని చిత్ర నిర్మాత తెలిపారు. అ ఆ తో తన రేంజ్ ని ఒక్కసారిగా పెంచేసిన నితిన్ ఈ మూడు సినిమాలతో ఎలాంటి హిట్స్ ని అందుకోనున్నాడో చూడాలి.

Leave a Reply