నెల వ్యవధిలో మూడు..నిత్య స్పీడ్

 nithya menon 3 movies one month distanceమనసులో ఏమీ పెట్టుకోకుండా ఉన్నదున్నట్లు మాట్లాడేయడం అందాల నిత్యా మేనన్‌కు ఉన్న అలవాటు. పక్కవాళ్లు నొచ్చుకున్నా.. తను మాత్రం ఈ వైఖరిని మార్చుకోలేదు. అందం-ప్రతిభ మెండుగా ఉన్న నిత్య.. తెలుగులో మన ఎన్టీఆర్‌తో జోడీ కట్టిన ‘జనతా గ్యారేజ్’తో సందడి చేసేందుకు రెడీ అయిపోతోంది. ఈ క్యూట్ లేడీ చేసిన మరో రెండు సినిమాలూ వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

మూడు వారాల వ్యవధిలో నిత్య నటించిన మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముందుగా ఆగస్టు 26న ‘100 డేస్ ఆఫ్ లవ్’ సినిమా,  సెప్టెంబర్ 2న ‘జనతా గ్యారేజ్’ 9న విక్రమ్ హీరోగా రూపొందిన ‘ఇంకొక్కడు’ వస్తున్నాయి. నిత్యా మీనన్ ఈ సినిమాల్లో చిన్న పాత్రలే చేసింది. తక్కువ టైములో ఎక్కువ సినిమాల చేసేయడం వల్లే అన్నీ ఇలా ఒకేసారి రిలీజైపోతున్నాయి.

SHARE