నిత్యానంద తెలుగు ఛానల్ ?రంజిత భక్తి పాఠాలు ?

  nithyananda swamy ranjitha started new telugu devotion channel

తెలుగులో మరో భక్తి ఛానల్ రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఛానల్ వెనుక వున్నది శృంగార సీడీల్లో దొరికిపోయిన నిత్యానంద స్వామి అని సమాచారం.ఆ సీడీల్లో ఆయనతోపాటు వున్న రంజిత ఈ ఛానల్ కార్యక్రమాల రూపకల్పనలో చురుకైన పాత్ర పోషిస్తారట.రక్తి సామ్రాజ్యాన్ని ఏలుతూ దొరికిపోయిన ఈ ఇద్దరూ తెలుగులో ఛానల్ గురించి ఎందుకు ఆలోచించారా అని పరిశీలిస్తే అంతకన్నా ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది..

ఓ పత్రికాధిపతి స్వయంగా నిత్యానందని కలిసి తెలుగులో భక్తి చానెల్స్ కి మంచి మార్కెట్ ఉందని …ఆర్ధిక మద్దతు ఇస్తే మీ గురించి గొప్పగా ప్రచారం చేస్తామని చెప్పి నిత్యానందని ఒప్పించారట.ఆ పత్రికాధిపతి గతం కూడా అంత గొప్పగా ఏమీలేదులెండి.ఏమైతేనేం ..నిత్యానందని ఛానెల్ కి ఒప్పించి ఇప్పటికే భక్తి పేరుతో కొట్టుకుంటున్న స్వామీజీల సరసన మరొకర్ని రంగంలోకి దించారు.

SHARE