పవన్ తో నివేదా ఛాన్స్..?

Posted December 19, 2016

Niveda Thomas Lucky Chance With Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న నీశన్ డైరక్షన్లోని మూవీ తమిళ సూపర్ హిట్ సినిమా వేదలంకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అజిత్ శృతి హాసన్ జంటగా నటించిన ఆ సినిమాను తెలుగులో నీశన్ డైరక్షన్లో ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సిస్టర్ క్యారక్టర్ కు ముందు ఆనందిని అనుకున్నా ఇప్పుడు ఆమె ప్లేస్ లో నివేదా ఆ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కాటమరాయుడా షూటింగ్ జరుపుకుంటున్న పవన్ ఆ సినిమా తర్వాత త్రివిక్రం సినిమాతో పాటుగా నీశన్ డైరక్షన్లో మూవీ చేస్తున్నాడు.

ఇక సినిమాలో హీరోయిన్ గా త్రిష సెలెక్ట్ అయినట్టు టాక్. జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నివేదా థామస్ తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నానితో పాటు పోటీ పడి మరి నటించి మెప్పించిన నివేదా పవర్ స్టార్ తో ఛాన్స్ కొట్టేయడం కెరియర్ కు మంచి బూస్ట్ ఇచ్చినట్టే. అయితే చేసేది పవర్ స్టార్ చెల్లెలి పాత్రే అయినా సినిమాలో ఆ రోల్ కు ఎక్కువ స్కోప్ ఉండటంతో నివేదా లక్కీ అని అంటున్నారు. ఇక ఇదే కాకుండా మరోసారి నాని హీరోగా చేస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది నివేదా థామస్.

SHARE