నాని లవ్వర్.. ఆయన్ని వదిలడం లేదట !

 Posted October 17, 2016

   nivetha thomas act nani new movie

నాని లవ్వర్ నిన్నొదలా.. ! అంటోంది. ‘జెంటిల్ మన్’ చిత్రంలో నాని లవ్వర్ గా నటించింది నివేదా థామస్. నాని-నివేదా కెమిస్ట్రీ తెరపై బాగా వర్కవుట్
అయ్యింది. నివేదా నటనలో ఇరగదీసింది. ఆమెకి లేడీ కమల్ హాసన్ అంటూ ఓ బిరుదు కూడా ఇచ్చేశాడు నాని. అయితే, ఇప్పుడీ జంట మరోసారి జతకట్టబోతోంది.

ప్రస్తుతం నాని నక్కిన త్రినాద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నేను లోకల్ ‘ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత  కొత్త దర్శకుడు శంకర్ లాలం
దర్శకత్వం లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న చిత్రం లో హీరోయిన్  గా నివేదా థామస్‌ ఎంపిక చేసినట్టు సమాచారమ్. ఇదే
నిజమైతే.. నాని-నివేదాల రొమాన్స్ మరోసారి చూడొచ్చన్న మాట.

SHARE