మన రీమేక్ పై అతని ఇంట్రెస్ట్..!

Posted November 27, 2016, 7:20 pm

Image result for premam movie hero kevin anne

మలయాళ ప్రేమంతో సూపర్ హిట్ అందుకున్న హీరో నివిన్ పౌలి సౌత్ లో కూడా సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే తమిళ నేరంతో హిట్ అందుకున్న నివిన్ తర్వాత టార్గెట్ తెలుగు సినిమా అని తెలుస్తుంది. అయితే డైరెక్ట్ గా తెలుగు సినిమాలు చేయకుండా ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను మలయాళంలో రీమేక్ చేయాలని చూస్తున్నాడు. ఈ సంవత్సరం చిన్న సినిమాల్లో పెద్ద విజయం అందుకున్న పెళ్లిచూపులు సినిమా రీమేక్ గా కన్నడ మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది.

ఎటొచ్చి తమిళ, మలయాళ వర్షన్స్ పెండింగ్లో ఉన్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత గౌతం మీనన్ ఆ సినిమా తమిళ మలయాళ రైట్స్ దక్కించుకున్నాడని టాక్. అయితే ఈ క్రమంలో రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కించాలని చూస్తున్నాడట. మలయాళంలో సూపర్ ఫాంలో ఉన్న నివిన్ పౌలితోనే తమిళ, మలయాళ సినిమాలు తీయాలని గౌతం మీనన్ ప్లాన్ చేస్తున్నాడట. సో మన రీమేక్ మీద నివిన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడన్నమాట.

ఇప్పటికే తన సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయినందుకు ఫుల్ ఖుషిగా ఉన్న నివిన్ తెలుగు హిట్ సినిమాను అక్కడ రీమేక్ చేసి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి విజయ్ దేవరకొండకు కెరియర్ లో మంచి బూస్టప్ ఇచ్చిన పెళ్లిచూపులు నివిన్ పౌలికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.