హారర్ కి భయపడ్డ త్రిష ..

0
412

 no act horror movie trishaఇటీవలిగా హారర్ సినిమాలతో వెండి తెరపై సందడి చేసిన చెన్నయ్ సొగసరి త్రిషకు బోర్ కొట్టేసిందట. అందుకే, ఆ తరహా చిత్రాలు ప్రస్తుతం చేయనని అమ్మడు దర్శక నిర్మాతలకు తెగేసి చెబుతోంది.15ఏళ్లుగా తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా రాణిస్తున్న త్రిషకు, ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ పోటీ అన్నది మాత్రం లేదు. ఆమెకు వచ్చే అవకాశాలు ఆమెకు వస్తూనే వున్నాయి.

అందుకే, ఇప్పటికీ బిజీ నాయికగానే కొనసాగుతోంది. అయితే, ఇటీవలి కాలంలో ఈ ముద్దుగుమ్మ వరుసగా ‘కళావతి’, ‘మోహిని’, ‘నాయకి’ వంటి కొన్ని హారర్ చిత్రాలు చేసింది. వాటికి ప్రేక్షకాదరణ కూడా లభించింది. దీంతో అలాంటి సినిమాలలో నటించమంటూ దర్శక నిర్మాతల నుంచి ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట.

అయితే, ఇలా వరుసగా ఒకే తరహా సినిమాలు చేస్తే ప్రేక్షకులకు, తనకు కూడా బోర్ కొట్టేస్తుందని, అందుకే వాటికి బ్రేక్ ఇస్తున్నానని చెప్పిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కమర్షియల్ నినిమాలలో మాస్ మసాలా పాత్రలు పోషిస్తానని చెబుతోంది. చెప్పడం వరకూ బాగానే ఉన్నా.. అలాంటి సినిమాల్లో ఛాన్స్‌లు ఈ అమ్మడికి దక్కుతాయా అన్నదే అసలు ప్రశ్న.

Leave a Reply