ఏపీ ,తెలంగాణ ల్లో నియోజక వర్గాల పెంపు లేదు..

0
261
no extended committees in andhra and telangana

Posted [relativedate]

no extended committees in andhra and telanganaఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లో నియోజక వర్గాల ప్రేమపు లేదని కేంద్రం తేల్చి చెప్పింది ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశల్లో తెలుగుదేశం పార్టీ సభ్యుడు టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకుసమాధానంగా కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది.

వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఆశపడుతున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలపై కేంద్రం నీళ్లు చల్లింది. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. నియోజకవర్గాల పెంపుపై రాజ్యసభలో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ సమాధానం ఇచ్చారు. ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెంపు కుదరదని స్పష్టం చేశారు. నియోజకవర్గాలను పెంచాలంటే ఆర్టికల్ 371 సవరించాలన్నారు. అది ఇప్పుడల్లా సాధ్యమయ్యే విషయం కాదని…కాబట్టి ఇప్పట్లో నియోజకవర్గాల సంఖ్య పెంపు కుదరదని హన్సరాజ్ వివరించారు.

పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంటుంది. పునర్విభజన చేయాలని తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై పదేపదే ఒత్తిడి తెస్తున్నాయి. చట్టం ప్రకారం 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. దీంతో రాజ్యాంగ ఇబ్బందులు రాకుండా అటార్నీ జనరల్ వివరణను కేంద్రం కోరింది. అయితే నిబంధనలు అంగీకరించవని కేంద్రానికి అటార్నీ జనరల్ నివేదిక ఇచ్చింది. అయితే ప్రత్యామ్నాయ పద్దతులను సూచిస్తూ తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి ప్రారంభించాయి.

ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లను 225కు పెంచాలని, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119సీట్లను 175కు పెంచాలనే వెసులుబాటు విభజన చట్టంలో ఉంది. సీట్లను పెంచాలంటే రాజ్యాంగంలోని 170వ ఆర్టికల్‌ను సవరించాలని అటార్నీ జనరల్ నివేదికలో తెలిపారు. డీ లిమిటేషన్‌ను 2026 వరకు సీల్ చేస్తూ గతంలో పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది. అందువల్ల ప్రస్తుతానికి రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ సీట్ల పెంపుకు అవకాశం లేదు. అయితే అనూహ్యంగా రాజ్యసభలో కేంద్రం ప్రకటన ఇరు రాష్ట్ర రాజకీయ పార్టీలను అయోమయం లోకి నెట్టింది .

Leave a Reply