ఎయిర్‌టెల్‌ పూర్తి ఉచితం ఇవ్వదంట..

  Posted November 3, 2016
no free voice calls in airtel networkజియోకి పోటీ ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటన రిలయన్స్‌ జియో మొబైల్‌ మార్కెట్‌లోకి వచ్చి ఎంత సంచలనం సృష్టించిందో తెలిసింది.. దశాబ్ద కాలంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు దాదాపు అందరూ చర్చించుకున్న అంశం ఇదే అంటే అతిశయోకి ్త కాదేమో.. సగటు మొబైల్‌ వినియోగదారుడు ఊహించని విధంగా ఉచితంగా.. డాటా.. కాల్స్‌ వాడుకునే అవకాశం ఇచ్చి పోటీ కంపెనీలకు సవాలు విసిరిన నేపథ్యంలో ఎయిటెల్‌ మాత్రం కొంత గుంభనంగా స్పందిస్తుందనే చెప్పాలి.. జియో వచ్చినా తమకేమి ఇబ్బంది లేదంటూనే కొత్త కంపెనీలు వచ్చినప్పుడు కొంత ఒడిదుడుకులు సహజమే అని సూచన ప్రాయంగా గట్టిపోటీ ఉంటుందని అంగీకరిస్తుంది. అయినా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ఇచ్చే ఆలోచనే లేదని తేల్చి చెప్పింది… టెలికం మార్కెట్లోకి కొత్త సంస్థల రంగప్రవేశం కారణంగా కొంతమేర సేవలపై వసూలు చేసే  చార్జీల ధరలు తగ్గవచ్చుకానీ, మొత్తంగా ఉచిత వాయిస్‌ కాల్స్‌ సాధ్యం కాదని ఎయిర్‌టెల్‌ అభిప్రాయపడింది. ప్రస్తుత టెలికం మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉందని, పోటీదారుల కారణంగా ఒత్తిడి పెరిగిన మాట నిజమేనని అయితే వారి కారణంగా తమకు ఎలాంటి కష్టం లేదని ఎయిర్‌టెల్‌ ఇండియా ఎండి, సిఇఒ గోపాల్‌ విట్టల్‌ చెప్పారు. కొత్త సంస్థలు వచ్చినప్పుడు ధరలు తగ్గడం సహజమేనన్నారు.
కొందరు డాటా మాత్రమే.. మరికొందరూ కాల్స్‌ మాత్రమే ఉపయోగించేవారుంటారు.. రెండూ వారే వారి సంఖ్య ఉంటుంది.. దాని ప్రకారం అందరికీ ఒకే ప్లాన్‌ సరిపోవాలంటే సాధ్యపడని అభిప్రాయం వెలిబుచ్చారు. స్మార్ట్‌ఫోన్‌ లేనివారికి కూడా సర్వీస్‌ ఇవ్వాల్సి వస్తుంది.. ఇప్పటికే తాము 999 రూపాయల ప్లాన్‌పై ఉచిత అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ ఇస్తున్నామని, అయితే అన్ని విభాగాల్లో ఇలాంటి ఆఫర్‌ సాధ్యం కాదని విట్టల్‌ చెప్పారు. వాయిస్‌ సేవలు, డేటా సేవలను విడివిడిగా చూడాలన్నారు. జియోలాగా తాము లైఫ్‌టైమ్‌ ఫ్రీ వాయిస్‌ సేవలను ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
SHARE