జనం లేని పుష్కర ఘాట్లు..

  no peoples pushkaraalu

కృష్ణ పుష్కరాలకు భక్తులు లేక వెలవెలబోతోంది. కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్క ఘాట్ కూడా భక్తులతో కళకళలాడలేదు. భారీగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఘాట్‌లన్నీ ఖాళీగా కనిపించాయి.

ఉదయం కొన్ని ఘాట్‌లలో జనం ఒక మోస్తరుగా కనిపించారు. రానురాను భక్తుల సంఖ్య పెరుగుతుందని అనుకుంటే, పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. ఏ ఘాట్ చూసినా వెలవెలబోతూ కనిపించింది. లక్ష మందికి పైగా ఒకేసారి స్నానం చేసేందుకు వీలుగా పద్మావతి, కృష్ణవేణి ఘాట్‌లను నిర్మించారు. కేవలం పదుల సంఖ్యలో మాత్రమే భక్తులు స్నానాలు ఆచరించారు.మరోపక్క గోదావరి పుష్కరాల సందర్భంగా తొలి రోజు తొక్కిసలాటలో పదుల సంఖ్యలో చనిపోయిన సంగతి తెలిసిందే.

మరోపక్క విజయవాడలో ఏర్పాట్లపై ప్రజల్లో అనుమానం ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రాలేదని చెపుతున్నారు. అంతేకాకుండా కృష్ణ నదిలో గోదావరి జలాలు కలిసినందువలన విజయవాడులో పుష్కర స్నానాలు చేయడానికి ఇష్టపడక కొంతమంది రాలేదని చెపుతున్నారు.
తొలి రోజు పిండ ప్రదానాలు పెద్దగా జరగలేదు.

ఈ మూడు రోజులే ముఖ్యం
ఇదిలా ఉండగా రానున్న మూడు రోజుల్లో పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. శనివారం సెకెండ్ సాటర్‌డే, ఆదివారం, సోమవారం ఆగస్ట్ 15 కావడంతో వరుసగా మూడు రోజులు సెలవలు వచ్చాయి. దీంతో భారీ సంఖ్యలో భక్తులు పుష్కరాలకు తరలి వస్తారని చెపుతున్నారు.

SHARE