ఆ కులానికి రిజర్వేషన్ వద్దంట…

Posted November 30, 2016, 6:44 pm

Related image

కాపుల రిజర్వేషన్ డిమాండ్ నేపథ్యంలో ఏలూరు వచ్చిన బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ్ కి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.రిజర్వేషన్ డిమాండ్ తో కాపు సంఘాల నేతలు ఆయన్ను కలవడానికి వచ్చినప్పుడే బీసీ సంఘాల నేతలు కూడా అక్కడికి వచ్చారు.దీంతో సంఘాల నేతల వాగ్వాదం జరిగింది.కాపులకి రిజర్వేషన్ కల్పిస్తే తమకి అన్యాయం జరుగుతుందని బీసీ నాయకులు వాదించారు.ఒకే చోట కూడిన రెండు సంఘాల నేతల్ని నిలువరించడం పోలీసులకి పెద్ద పనయ్యింది.

ఈ ఘటన నేపథ్యంలో మంజునాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.బీసీ ల్లో తమని చేర్చాలని ఎన్నో అగ్రకులాల నుంచి కూడా విజ్ఞాపనలు వచ్చాయని …అయితే కమ్మ కులం నుంచి మాత్రం అలాంటి డిమాండ్ రాలేదని అయన చెప్పారు.దీంతో ఆ కులానికి రిజర్వేషన్ అవసరం లేదన్నట్టే కనిపిస్తోంది.