ట్రంప్ పేరు తొలగిస్తున్నారు …

0
550
we cant live here

 Posted [relativedate]

we cant live here

ఆయన పేరు ఉన్న నివాసాల్లో తాము ఉండలేమని, ఆ పేరైనా తీసేయాలని లేదంటే మరో ఇళ్లయినా ఇవ్వాలని న్యూయార్క్ నగరంలోని పలు చోట్ల కొందరు నివాసులు డిమాండ్ చేశారు.తాజా గా అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ కు కొంతమంది అమెరికా ప్రజలనుంచి సెటైర్లు ఎదురవుతున్నాయి . దీంతో ఓ మూడు బహుళ అంతస్తులకు ఉన్న ట్రంప్ ప్లేస్ అనే పేరును తొలగించేందుకు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మొత్తం 1,325మంది ఉండగా వారిలో దాదాపు 669మందికి పైగా ట్రంప్ పేరు వాటికి ఉండటాన్ని వ్యతిరేకిస్తూ ఆన్ లైన్ లో పిటిషన్ వేశారు.

మన్ హట్టన్ లోని హడ్సన్ నదీ ఒడ్డున ఉన్న భారీ అంతస్తులకు బంగారు అక్షరాలతో అమర్చిన ట్రంప్ ప్లేస్ అనే పేరును తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ కు మహిళలంటే గౌరవం లేదని, ఆయన వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారని, కన్న కూతురుని కూడా తక్కువ చేసి మాట్లాడాడంటూ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వీడియోలు లీకులు చేసిన విషయం తెలిసిందే. మహిళలపై ఇంతటి చిన్నచూపు ఉన్న ట్రంప్ పేరిట ఉన్న ఈ నివాసాల్లో తాము కాపురం చేయలేమంటూ అక్టోబర్ లోనే వారు ఆందోళన మొదలుపెట్టారు.ఇది ఎప్పుడు బిల్డింగ్ ల పేర్లు మార్చే వరకు వచ్చింది .అందుకే నోరూ వీపుకి దెబ్బలు ……అన్నారు పెద్దలు ..

Leave a Reply