హృతిక్ సినిమాకు దొరకని థియేటర్!!

Posted January 26, 2017

no theaters for hruthik kaabil movie
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ సినిమాకు థియేటర్ దొరకలేదు. దేశంలోని ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఈ పరిస్థితి ఎదురయ్యిందంటే ఏమో అనుకోవచ్చు. కానీ సాక్షాత్తూ హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క థియేటర్ దొరకక పోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు సినీ జనాలు.

హృతిక్ రోషన్, రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కాబిల్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘బలం’ పేరుతో డబ్ చేశారు. హృతిక్ రోషన్ సరసన యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది. యూట్యూబ్ లో ట్రయిలర్ ను 48 గంటల్లో 25 లక్షల మంది వీక్షించారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. తీరా సినిమా విడుదల చేద్దామంటే మాత్రం సౌత్ లో థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.

తెలుగులో ప్రస్తుతం ఖైదీ నెంబర్-150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు సందడి చేస్తున్నాయి. దీనికి తోడు మంచు విష్ణు సినిమా లక్కున్నోడు కూడా ఎక్కువ థియేటర్లలో విడుదలవుతోంది. మిగిలిన థియేటర్లను షారుఖ్ సినిమా రయీస్ ఆక్రమించేసింది. ఈ టఫ్ కాంపిటిషన్ లో హృతిక్ కు హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క థియేటర్ కూడా దొరకలేదు.

హైదరాబాద్ ను మినహాయిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల్లో అక్కడక్కడ బలం సినిమాకు థియేటర్లు దొరికాయి. అయితే హైదరాబాద్ లో దొరక్కపోవడంతో నిర్మాత చాలా అసంతృప్తితో ఉన్నాడట. మంచి ఓపెనింగ్స్ తో కుమ్మేద్దామంటే పెద్ద సినిమాలు పొట్ట కొట్టాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. హృతిక్ సినిమాకే ఇలాంటి పరిస్థితి ఉంటే… మరి చిన్న సినిమాల కథేంటో అర్థం చేసుకోవచ్చు!!!

SHARE