ఏ వంట నూనె ఆరోగ్యానికి మేలు..?

227

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]Non Refined Oil good for health

మహర్షి వాగ్బటాచార్యులంటారు జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన వంట నూనెలను వాడవలెను.

మహర్షి వాగ్బటాచార్యులంటారు జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన వంట నూనెలను వాడవలెను. శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండ్ నూనే ( Non Refined Oil ) . నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది , బాగా జిగురు , జిగురుగా ఉంటుంది. చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది . నూనెలో ఉండ వలసిన ముఖ్య అంశం జిగురు పదార్ధము , ప్రోటీన్స్ . ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు . నూనెలో వాసన రూపంలో ఉండే ఆర్గానిక్ కంటేంటే ప్రోటీన్స్ , ఫ్యాటీ యాసిడ్స్. నూనెని రిఫైండ్ ( Refined ) చేసినపుడు జిగురు , వాసన పోతాయి . ఇక అందులో ఉండేది నూనె కాదు నీళ్ళే .

ఏ నూనెలో కూడా మంచి కొలెస్ట్రాల్ , చెడ్డ కోలెస్ట్రాల్ వుండదు . మనము తీసుకొనే ఆహారము మరియు నూనెల నుండి మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్ తయారవుతుంది . మనము శుద్ధమైన నూనె ( Non Refined Oil ) తీసుకున్నప్పుడు మన శరీరంలో లివర్ సహాయంతో మంచి కొలెస్ట్రాల్ ( H.D.L.) ఎక్కవ మోతాదులో తయారవుతుంది. శుద్ధమైన నూనె వాడి జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి .

భారత దేశంలో 50 సంవత్సరాల పూర్వం వరకు ఈ రిఫైండ్ ఆయిల్ లేదు . రిఫైండ్ నూనె చేసేటప్పుడు 6 రకాల హానికరమైన కెమికల్స్ , డబుల్ రిఫైండ్ చేసేటప్పుడు 13 రకాల హానికరమైన కెమికల్స్ వాడుతారు . ఈ కెమికల్స్ ముందు ముందు మన శరీరంలో వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి . ఈ రిఫైండ్ అయిలో మన శరీరానికి కావలసిన జిగురు , వాసన , ప్రోటీన్స్ , ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ వుండవు. చాలా హానికరమైన ఎటువంటి రిఫైండ్ ఆయిల్స్ వాడకూడదు .

వాతాన్ని నివారించటానికి శుద్ధమైన నూనె , పిత్తాన్ని నివారించటానికి దేశవాళి ఆవు నెయ్యి , కఫంను సక్రమంగా ఉంచాలంటే అన్నింటికన్నా ఉత్తమమైనది బెల్లం , తేనె. కుస్తీపట్లు , దండీలు , బస్కీలు తీసేవారికి మాత్రమే గేదె నెయ్యి మంచిది .

రోగాలకు రాజు వాతరోగాలు.
మోకాళ్ళ నొప్పులు , నడుం నొప్పి , మెడనొప్పులు , హార్ట్ ఎటాక్ , పక్షవాతము , బ్రైన్ ట్యూమర్ వంటివి వాతము పూర్తిగా తగ్గిపోవటం వల్ల కానీ లేదా చెడిపోవటం వల్ల కానీ కలుగుతాయి .

జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్దమైన నునెలు ( Non -Refined ) వేరు శెనగ నూనె , కొబ్బెర నూనె , కుసుమల నూనె , నువ్వుల నూనె మరియు ఆవాల నూనెలు మాత్రమే వాడవలెను .

ప్రొద్దుతిరుగుడు పూల విత్తనాలను ( Sun flower seeds ) గేదలకు మరియు పశువులకు మాత్రమే పెట్టదగినవి . మనకు ఏ మాత్రము ఈ Sun flower oil వాడదగినది కాదు , ఆరోగ్యకరము కాదు .

ఈ రిఫైండ్ ఆయిల్స్ ( Refined oils) ఎంత మాత్రమూ వాడతగినవి కాదు .

సోయాబీన్స్ , సోయాబీన్స్ ఆయిల్ మరియు సోయాబీన్ పాలు ఏ మాత్రము వాడరాదు . పందులు తినతగినవి ఈ సోయాబీన్స్ , ఎందుకనగా పందులు మాత్రమే వీటిని తిని అరగించు కోగలవు . మనుష్యులలో ఈ సోయాబీన్స్ ని అరిగించే ఎంజైమ్స్ లేనే లేవు . కావున వీటిని వాడరాదు . వీటిని వాడిన యెడల మందులు లేని భయంకరమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి .

పామోలిన్ అయిల్ కూడా చాలా హానికరమైన అయిల్ . వీటిని వాడుతున్నవారికి మొదట మలబద్దకుము వస్తుంది. ఈ మలబద్దకమే అన్ని రోగాలకు మూలము. ప్రస్తుతము చాలా రోగాలకు మూలము ఈ పామోలిన్ అయిల్. ఈ పామోలిన్ పంట పండించే దేశాలలో ఈ నూనెను నిషేదించినారు . వారు ఏ విధముగా కూడా ఈ పామోలిన్ వాడటం లేదు . ప్రపంచములో ఒక్క భారత దేశములో మాత్రమే ఉపయోగిస్తున్నారు .

విదేశీయులకు భారత దేశము ఒక ప్రయోగశాలగా మారింది. కావున మనము మన సంపూర్ణ ఆరోగ్యము కొరకు త్యజించ వలెయును .
శుద్దమైన నూనెలను వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించ గలరు.

గమనిక :– సన్ ఫ్లవర్ ఆయిల్ ( Sun Flower Oil ), సోయాబిన్ ఆయిల్ ( Soya Bean Oil ) , పామోలిన్ ఆయిల్ ( Pamolene Oil ) ఈ నూనెలు వాడరాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here