Posted [relativedate]
గతంలో సమైక్యరాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసిన ఎన్డీ తివారీని ఎవరూ మర్చిపోలేరు. రాజ్ భవన్ నే రాసలీలల అడ్డాగా చేసుకొని.. చివరకు పదవిని పోగొట్టుకున్నారాయన. సేమ్ అలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. మేఘాలయలో ఇదే సీన్ రిపీటైంది.
తమిళనాడుకు చెందిన షణ్ముఖ నాథన్ గతంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ఉన్నారు. మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది. దీంతో కేంద్రం ఆయన్ను 2015లో మేఘాలయకు గవర్నర్ గా పంపింది. అయితే సారు మాత్రం వచ్చినప్పటి నుంచి తన హోదా మరిచి… రాసలీలల్లోనే కాలం గడిపేసే వారట. మేఘాలయ రాజ్ భవన్ కాస్తా రొమాన్స్ భవన్ గా మారిపోయిందని కూడా ప్రచారం జరిగింది.
గవర్నర్ గా విధుల్లోకి చేరిన తర్వాత షణ్ముఖ నాథన్ తన చుట్టూ ఉన్న సిబ్బందిని మాత్రం మహిళలనే నియమించుకున్నారు. ఇద్దరు ప్రజా సంబంధాల అధికారులు, ఒక కుక్, ఒక నర్స్ …ఇలా సిబ్బంది అంతా మహిళలే. రాత్రి పగలు తేడా లేకుండా షణ్ముఖం సారు విలాసాల్లో మునిగి తేలేవారట. గత ఏడాదిన్నర కొంత కాలంగా రాజ్ భవన్ కు అమ్మాయిల రాక పెరిగిందట. కొందరు అమ్మాయిలైతే షిఫ్టుల వారీగా వచ్చి వెళ్లే వారని టాక్. వాళ్లంతా గవర్నర్ గారి బెడ్ రూంలోనే సమయమంతా గడిపే వారట. యంగ్ లేడీస్ క్లబ్ ను తలపించేలా సమయం.. సందర్భం లేకుండా అక్కడ గానా- బజానా జరిగేదని సమాచారం.
మొదట్లో ఈ అమ్మాయిల విషయాన్ని రాజ్ భవన్ ఉద్యోగులు అంత సీరియస్ గా పట్టించుకోలేదట. కానీ రానురాను షణ్ముఖం సారుకు అమ్మాయిల పిచ్చి ముదరడంతో ఇక లాభం లేదని… వారంతా గట్టి నిర్ణయం తీసుకున్నారు. 100 మంది రాజ్ భవన్ ఉద్యోగులు రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీంతో విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చేసింది. జరుగుతున్న తతంగమంతా బట్టబయలైంది.
కేంద్రం వేటు వేయడం ఖాయంగా కనిపించడంతో షణ్ముఖం సారు కూడా.. ఎన్టీ తివారీలా బెటర్ ఆప్షన్ ను ఎంచుకున్నారు. తనపై వేటు పడే లోపే.. గౌరవప్రదంగా తానే రాజీనామా చేశారు. గవర్నర్ గా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి అడ్డమైన పనులు చేస్తే.. ఈ మాత్రం పనిష్ మెంట్ తప్పదు మరి!!!