బాక్సర్ గా తారక్?

  ntr act boxer role
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ రిజిస్టర్ చేసిన బాక్సర్ టైటిల్ ఆసక్తి రేపుతోంది.తమ్ముడు తారక్ కోసమే నిర్మాత కళ్యాణ్ రామ్ ఈ టైటిల్ రిజిస్టర్ చేశాడని ఓ వార్త వినిపిస్తోంది.పూరి డైరెక్షన్ లో చేసే సినిమా కి బాక్సర్,420 అనే రెండు పేర్లు పరిశీలిస్తున్నట్టు చెప్తున్నా మరో టాక్ కూడా వస్తోంది.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తాను హీరోగా తీయబోయే సినిమాకి కళ్యాణ్ రామ్ బాక్సర్ టైటిల్ రిజిస్టర్ చేశారని దాని సారాంశం.

కళ్యాణ్ కి పటాస్ లాంటి హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి రీసెంట్ గా ఎన్టీఆర్ కి ఓ కథ చెప్పారు.ఆ కథ కళ్యాణ్ కి బాగా నచ్చిందట.తమ్ముడు ఓకే అంటే తనతో లేదంటే తానే హీరో గా ఈ సినిమా చేయాలనుకుంటున్నారంట.ఆ సినిమా కోసమే బాక్సర్ టైటిల్ అని మరో వెర్షన్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది.మొత్తానికి ఈ బాక్సర్ ఎవరో కళ్యాణ్ నోరు విప్పేదాకా ఇలాంటి ఊహాగానాలు వస్తూనే ఉంటాయి.

SHARE